పవన్ కల్యాణ్‌కు హీరో విజయ్ కౌంటర్..ఊసరవల్లి కంటే వేగంగా రంగులు మారుస్తున్నావ్

జనసేన ఆవిర్భావ వేడుకల్లో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పార్టీ వేడుకలో భాగంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ హిందీ భాషపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ భాషను అందరూ నేర్చుకోవల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.హిందీ సినిమాల డబ్బింగ్‌తో బిజినెస్ చేసుకోవచ్చు గానీ హిందీ మాట్లాడకూడదంటారా అంటూ తమిళనాడు ప్రభుత్వంపై మండిపడ్డారు.హిందీ వ్యతిరేకిస్తున్న వాళ్లు కూడా తమ సినిమాలు హిందీలో డబ్ చేసుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయలకున్న త్రిభాషా సూత్రాన్ని అనుసరించక తప్పదని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.హిందీ భాషపై కావాలనే గగ్గోలు పెడుతున్నారంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు పవన్ చురకలు అంటించారు.

మరోవైపు పవన్ కల్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళ రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.టీవీకే పార్టీ అధినేత విజయ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. నోరు అదుపులో పెట్టుకోమంటూ పవన్ కళ్యాణ్‌ను ఆయన హెచ్చరించారు. ఇతర భాషలపై తమకు గౌరవం ఉందని, అలాగని ఆ భాషల్ని తమపై రుద్దాలని చూడటం మంచిది కాదన్నారు. ఆవిర్భావ సభ జనసేనదే కానీ ఎజెండా మాత్రం బీజేపీదని ఆయన స్పష్టం చేశారు.

TVK Party President Vijay Gives Counter to Deputy CM Pawan Kalyan

తమిళ, తెలుగు, మలయాళ భాషల్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మూడో భాషగా అంగీకరిస్తారా అని విజయ్ పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ముఖ్యంగా ఏపీకు చెందిన చాలామందికి ఉపాధి కల్పిస్తున్నామని ఆయన గుర్తు చేశారు.ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని విజయ్ సూచించారు. ఇక పవన్ కల్యాణ్ తీరుపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉత్తరాది అహంకారం అంటూ గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోలను బయటకు తీసి..ఊసరవల్లి కంటే వేగంగా మారుతున్న పవన్ కళ్యాణ్ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+