వర్సిటీల నకిలీ సర్టిఫికేట్ల తయారీ: ఇద్దరి అరెస్ట్(పిక్చర్స్)
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీతోపాటు పలు విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ముఠాలోని ఇద్దరు వ్యక్తులను అంబర్‌పేట పోలీసులు, సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఓయూకు చెందిన 6 నకిలీ సర్టిఫికేట్లు, కంప్యూటర్, కలర్ మానిటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఆదివారం అంబర్‌పేట పోలీస్ స్టేసన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈస్ట్ జోన్ అదనపు డిసిపి చంద్రశేఖర్, మలక్‌పేట ఏసిపి సుధాకర్, ఇన్‌స్పెక్టర్లు వెంకటరమణ, ఆనంద్ కుమార్ నకిలీ సర్టిఫికేట్ల తయారీకి సంబంధించిన వివరాలను తెలిపారు. నల్గొండ జిల్లాలోని మోత్కూరుకు చెందిన బత్తిని సత్తయ్య అలియాస్ సత్యం(33) ఓ ఛానల్‌లో గ్రాఫిక్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు.
అతడు బాగ్‌అంబర్‌పేటలో నివాసం ఉంటున్నాడు. కింగ్ కోఠి పరదాగేట్‌కు చెందిన వ్యాపారి షేక్ మహమ్మద్ అల్ అమౌదీ(35)తో కలిసి ఇంట్లో ఆయా విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి అవసరమైన వారికి విక్రయిస్తున్నాడు. 2008లో నారాయణగూడ ఠాణా, 2012లో అఫ్జల్‌గంజ్ ఠాణా పరిధిలో నకిలీ సర్టిఫికెట్ల తయారీ, విక్రయ కేసులో సత్యం, సిరాజుద్దీన్‌తో కలిసి అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత మళ్లీ నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశారు.

ఇద్దరి అరెస్ట్
ఉస్మానియా యూనివర్సిటీతోపాటు పలు విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ముఠాలోని ఇద్దరు వ్యక్తులను అంబర్‌పేట పోలీసులు, సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి అరెస్ట్ చేశారు.

ఇద్దరి అరెస్ట్
వారి వద్ద నుంచి ఓయూకు చెందిన 6 నకిలీ సర్టిఫికేట్లు, కంప్యూటర్, కలర్ మానిటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరి అరెస్ట్
ఆదివారం అంబర్‌పేట పోలీస్ స్టేసన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈస్ట్ జోన్ అదనపు డిసిపి చంద్రశేఖర్, మలక్‌పేట ఏసిపి సుధాకర్, ఇన్‌స్పెక్టర్లు వెంకటరమణ, ఆనంద్ కుమార్ నకిలీ సర్టిఫికేట్ల తయారీకి సంబంధించిన వివరాలను తెలిపారు.

ఇద్దరి అరెస్ట్
నల్గొండ జిల్లాలోని మోత్కూరుకు చెందిన బత్తిని సత్తయ్య అలియాస్ సత్యం(33) ఓ ఛానల్‌లో గ్రాఫిక్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. కింగ్‌కోఠి పరదాగేట్‌కు చెందిన వ్యాపారి షేక్ మహమ్మద్ అల్ అమౌదీ(35)తో కలిసి ఇంట్లో ఆయా విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి అవసరమైన వారికి విక్రయిస్తున్నాడు.












Click it and Unblock the Notifications