టోకెన్ల జారీలో భారీ మార్పులు చేసిన టీటీడీ

Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం నాడు 65,066 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 24,620 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.13 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పట్టింది.

అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ భారీ మార్పులను చేపట్టింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న మొదట వచ్చిన వారికి మొదట.. విధానానికి స్వస్తి పలికింది. దీని స్థానంలో కొత్తగా లక్కీ డిప్ విధానం అమలులోకి వచ్చింది. ఆర్జిత సేవల టోకెన్ల జారీలో ప్రస్తుతం ఈ విధానం అమలులో ఉన్న విషయం తెలిసిందే. అదే తరహాలోనే అంగప్రదక్షిణం టోకెన్లను కూడా జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది టీటీడీ.

Unlock Your Chance to Participate TTD Changes Angapradakshinam Token System to Lucky Dip

ఇకపై టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో లక్కీ డిప్ సిస్టమ్ ద్వారా విడుదల అవుతాయి. ఈ విధానంలో ఈ నెల 18వ తేదీ నుండి అమలులోకి రానుంది. డిసెంబర్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణ టోకెన్ల కోసం ఈ నెల 18వ లేది నుండి 20వ తేదీ వరకు లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లక్కీ డిప్ ద్వారా ఎంపికైన భక్తులకు ఈ టోకెన్లను కేటాయిస్తారు. శుక్రవారం మినహా ప్రతిరోజూ 750 టోకెన్లు, శనివారాల్లో 500 టోకెన్లను టీటీడీ జారీ చేస్తుంది.

మళ్లీ అంగప్రదక్షిణం చేయదలిచిన భక్తులకు 180 రోజుల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. భక్తులు తిరిగి ఈ సేవ పొందేందుకు గడువు 90 రోజుల బదులు 180 రోజులుగా నిర్ణయించింది. ఈ మార్పును గమనించి అంగప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.

కాగా- తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం జరిగిన పాలక మండలి సమావేశం సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్‌, బోర్డు సభ్యులు.. శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల బుక్లెట్- 2025ను విడుదల చేశారు. తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగనున్నాయి. సెప్టెంబర్ 23న అంకురార్పణం, సెప్టెంబర్ 24న ధ్వజారోహణం, సెప్టెంబర్ 28న గరుడవాహనం, అక్టోబర్ 2న చక్రస్నానం జరుగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+