ఇది పెళ్లి ఫొటోషూట్ కాదు బాసూ..ఏకంగా కార్యమే..!
ఈ రోజుల్లో పెళ్లి అనగానే కేవలం బంధుమిత్రుల సందడి కాదు, సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే వెడ్డింగ్ షూట్‌లు కూడా. కొందరు జంటలు తమ పెళ్లి జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుండేలా, నలుగురికీ భిన్నంగా ఉండాలని కొన్ని సాహసోపేతమైన, మరికొన్నిసార్లు హాస్యాస్పదమైన 'పిచ్చి పిచ్చి' చేష్టలకు పాల్పడుతున్నారు. అయితే, ఈ ఆరాటం కొన్నిసార్లు హద్దులు దాటి, వివాదాస్పదంగా మారుతోంది. పవిత్రంగా భావించే వివాహ బంధానికి నాంది పలికే ఈ ప్రీ-వెడ్డింగ్ షూట్‌లు, కొన్నిసార్లు అసహ్యించుకునే స్థాయికి చేరిపోతున్నాయి.
కొందరు జంటలు అందరికంటే భిన్నంగా ఉండాలని కోరుకుంటూ శ్మశానాలు వంటి అసాధారణ ప్రదేశాల్లో షూట్‌లు చేయించుకుంటున్నారు. ఇది సంప్రదాయవాదుల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. అంతేకాదు, సముద్రాలు, నదులు, కొండలు వంటి ప్రమాదకరమైన ప్రదేశాల్లో సాహసోపేతంగా షూట్‌లు చేయించుకుంటూ, కొందరు జంటలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. బైక్‌లపై స్టంట్‌లు చేస్తూ షూట్‌లు చేయించుకొని ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు. ఇలాంటి ప్రమాదకరమైన ప్రయోగాలు అనవసరమైన రిస్క్‌కు దారితీస్తున్నాయి.

జంటల మధ్య కెమిస్ట్రీని చూపించడం ప్రీ-వెడ్డింగ్ షూట్‌ల ముఖ్య ఉద్దేశ్యం. కానీ కొన్నిసార్లు ఈ కెమిస్ట్రీ హద్దులు దాటి, ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించేలా మారుతోంది. సెమీ-న్యూడ్‌గా ఉండే ప్రీ-వెడ్డింగ్ షూట్‌లు సైతం కొందరు చేయించుకుంటున్నారు. ఈ ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయబడటంపై తీవ్ర చర్చ జరుగుతోంది.
తాజాగా, గోవా బీచ్‌లో జరిగిన ఒక "క్రేజీ" ప్రీ-వెడ్డింగ్ షూట్ నెటిజన్లను అవాక్కయ్యేలా చేసింది. ఒక ఫిట్‌నెస్ ప్రియులైన జంట బీచ్‌లో "హాట్ హాట్ ఫోజులతో" రెచ్చిపోయారు. ముఖ్యంగా వధువు ఇచ్చిన యోగా స్టిల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. వారిద్దరి కెమిస్ట్రీ, ఫొటో షూట్‌లో వారిని వరల్డ్ టాప్ మోడల్స్‌గా కనిపించేలా చేసింది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. వీరి తంతు చూస్తుంటే పెళ్లికి ముందే కార్యం కానిచ్చేలా ఉన్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ ఫొటోషూట్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications