Unstoppable 2 PSPK x NBK బాలయ్య - పవన్ గ్లింప్స్ : గూస్ బంప్స్..!!

PSPK x NBK First Glimpse: నందమూరి - మెగా అభిమానులకు సంక్రాంతి వేళ గుడ్ న్యూస్. ఇద్దరు అగ్రహీరోల అభిమానులు ఎదురు చూస్తున్న 'అన్‌స్టాపబుల్‌-2' పవన్‌ కళ్యాణ్‌ ఎపిసోడ్‌ ప్రోమో వచ్చేసింది. ఈ ఇద్దరి టాక్ షో పైన భారీ అంచనాలు ఉన్నాయి. తొలి సీజన్ పూర్తి చేసిన బాలయ్య అంతకుమించి అన్నట్లుగా సెకండ్ సీజన్ ప్రారంభించారు. ఆహా ఓటీటీ వేదికగా పవన్ కల్యాణ్ తో బాలయ్య చేసిన రచ్చ అన్ స్టాపబుల్ గా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ షూటింగ్ కు వచ్చిన సమయం నుంచి అక్కడ అంతా సందడి వాతావరణం కనిపించింది. బాలయ్య స్వయంగా పవన్ ను ఆహ్వానించారు. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ కోసం నిరీక్షిస్తున్నారు. సంక్రాంతి వేళ ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో అభిమానుల ముందుకు వచ్చింది.

నందమూరి - మెగా అభిమానలకు పండుగ స్పెషల్..

ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో ఈ టాక్ షోకు సంబంధించి షూటింగ్ పూర్తి చేసారు. సంక్రాంతి పండుగకు స్ట్రీమింగ్ అవుతుందని భావించినా..మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనపిస్తోంది. రిపబ్లిక్ డే నాడు ఈ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక, అసలు టాక్‌ షోలకే రాని పవన్‌ కళ్యాణ్‌ మొదటి సారి టాక్‌ షోకు.. అది కూడా బాలయ్య హోస్ట్‌ చేస్తున్న షోకు రావడం తెలుగు రాష్ట్రాల్లో ఒక సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. వారిద్ధరి మధ్య మాట ముచ్చట ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు తీవ్ర ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆహా సంస్థ పవన్‌ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో సిల్వర్ స్క్రీన్ ప్రజెంటేషన్ కు ఏ మాత్రం తగ్గకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అభిమానుల హంగామా చూపుతూ మరింత ఆసక్తి పెంచే ప్రయత్నం చేసారు.

పవన్ కొలతల గురించి బాలయ్య..

పవన్ కొలతల గురించి బాలయ్య..

పండుగ నాడు విడుదల చేసిన ఈ ప్రోమోలో పెద్దగా ఎపిసోడ్ విషయాలను బయట పెట్టలేదు. కానీ, పవన్ ను వేదిక మీదకు వచ్చే వేళ ఏ స్థాయిలో ప్రేక్షకుల అంచనాలు ఉన్నాయనేది చూపించే ప్రయత్నం చేసారు. బాలయ్య ఈ ప్రోమోలో పవన్ కొలతలు తెలుసుకోవాలని అడగటం.. పవన్ దానికి నవ్వుతూ స్పందించటం ఉంది. ఇక..ఈ ఎపిసోడ్ లో పవన్ కల్యాణ్ కు సంబంధించిన సినిమా - పొలిటికల్ అంశాలతో పాటుగా పర్సనల్ లైఫ్ గురించి బాలయ్య సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసారని తెలుస్తోంది. పవన్ సైతం తన పర్సనల్ లైఫ్ లోని అంశాలను ఓపెన్ గా షేర్ చేసుకున్నారని చెబుతున్నారు. ఇదే షో లో మధ్యలో బాలయ్య కుమారుడు .. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఎంట్రీ ఉన్నాయి. రాం చరణ్ ఫోన్ సంభాషణ స్పెషల్ హైలైట్ గా చెబుతున్నారు.

పవన్ ను విమర్శించే వారికి బాలయ్య మాస్ వార్నింగ్..

పవన్ ను విమర్శించే వారికి బాలయ్య మాస్ వార్నింగ్..

పవన్ కల్యాణ్ ను రాజకీయంగా విమర్శించే వేళ.. వ్యక్తిగత జీవితంలోని అంశాలను ప్రస్తావించిన అంశం పైన ఈ టాక్ షో ద్వారా పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారని సమాచారం. పవన్ ఇచ్చిన సమాధానం విన్న తరువాత ఇక ఎవరైనా పవన్ వివాహాల గురించి ప్రశ్నిస్తే.. చెప్పుతో కొడతానంటూ బాలయ్య మాస్ వార్నింగ్ ఇచ్చారు. అదే విధంగా రాజకీయంగా టీడీపీతో పొత్తుల గురించి పవన్ తో చెప్పించేందుకు బాలయ్య ప్రయత్నం చేసారని సమాచారం. బాలయ్య - పవన్ కల్యాణ్ కాంబోలో సిద్దమైన ఈ టాక్ షో పూర్తి ఎపవిసోడ్ కోసం ఇద్దరు హీరోల అభిమానులు వేచి చూస్తున్నారు. తొలి గ్లింప్స్ కే అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఈ టాక్ షో సంచలనంగా మారుతుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+