బాలకృష్ణతో పవన్ కళ్యాణ్ - అప్పుడే పవర్ ప్యాక్డ్ పంచ్ పడింది..!!

అమరావతి: ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 లేటెస్ట్ ఎపిసోడ్ షూటింగ్ మొదలైంది. పవర్ ప్యాక్డ్ ఎపిసోడ్ ఇది. పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇందులో సందడి చేయడమే దీనికి కారణం. ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా ఆరంభమైంది. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు చెందిన ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారమౌతుంది.

ఈ టాక్ షో సెకెండ్ సీజన్- తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడితో ఆరంభమైంది. ఇప్పుడు తాజాగా పవన్ కల్యాణ్ దీనికి హాజరయ్యారు. ఇంతకుముందు ఎపిసోడ్‌లో ప్రభాస్, గోపీచంద్ తళుక్కున మెరిశారు. వారితో బాలయ్యబాబు సందడి చేశారు. ఆ ఎపిసోడ్ ప్రోమోస్ విడుదలయ్యాయి. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ ఈ టాక్ షోకు హాజరు కానున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ ఆరంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్నాయి.

 Unstoppable with NBK 2: Minister Ambati Ramababu slams Pawan Kalyan here is the reason

బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఓ ఎపిసోడ్‌లో ఆయన త్రివిక్రమ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అన్‌స్టాపబుల్‌కు ఎప్పుడు వస్తున్నావంటూ ప్రశ్నించారు. మీరు ఓకే అంటే వెంటనే వచ్చేస్తా నంటూ త్రివిక్రమ్ బదులిచ్చారు. ఎవరితో రావాలో తెలుసు కదా? అంటూ పవన్ కళ్యాణ్ గురించి బాలకృష్ణ ప్రస్తావించారు. ఆ ఎపిసోడ్‌తో పవన్ కల్యాణ్ ఈ షోలో పాల్గొనబోతోన్నారనే హింట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌కు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లోజ్ ఫ్రెండ్ కావడమే దీనికి కారణం.

 Unstoppable with NBK 2: Minister Ambati Ramababu slams Pawan Kalyan here is the reason

పవన్ కల్యాణ్ అలా ఈ అన్‌స్టాపబుల్ 2 షోలో పాల్గొన్నారో లేదో.. ఇలా విమర్శల పంచ్ పడింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు- దీనికి శ్రీకారం చుట్టారు. పవన్ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు సంధించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఓ పోస్ట్ పెట్టారు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నిర్వహించిన షోలో పాల్గొనడానికి పవన్ కల్యాణ్ ఆసక్తి చూపలేదని, ఇప్పుడు బాలయ్య బాబు కోసం జమ్మ కట్టారని ఎద్దేవా చేశారు.

 Unstoppable with NBK 2: Minister Ambati Ramababu slams Pawan Kalyan here is the reason

రక్తసంబంధం కన్నా ప్యాకేజీ బంధమే గొప్పదా? అంటూ అంబటి రాంబాబు పవన్ కల్యాణ్‌కు చురకలు అంటించారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు కూడా పవన్ కల్యాణ్‌పై విమర్శలు సంధిస్తోన్నారు. ఇదివరకు కాపు సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడిన నందమూరి బాలకృష్ణపై ఇదే పవన్ కల్యాణ్ బహిరంగంగా విమర్శించారని, ఇప్పుడు అవన్నీ మరిచి బాలకృష్ణ ముందు చేతులు కట్టుకుని నిల్చున్నాడంటూ విమర్శిస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+