వివాహాల క్లారిటీ - చాలా ఓపెన్ గా : టీడీపీపై పవన్ దిమ్మతిరిగే ఆన్సర్ : బాలయ్య వార్నింగ్..!?
నందమూరి బాలయ్య -పవన్ కల్యాణ్. ఈ కాంబో పై కొద్ది కాలంగా భారీ అంచనాలు. ఇద్దరూ ఒకే వేదికపైకి వచ్చారు. ఇద్దరి అన్ స్టాపబుల్ ఈవెంట్ అంతకుమించి అన్నట్లుగా సాగింది. బాలయ్య ఏం ప్రశ్నలు సంధిస్తారు..పవన్ ఏం చెబుతారనే అంచనాలను మించేలా షో జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ టాక్ షో వేదికగా బాలయ్య ఊహించని ప్రశ్నలు సంధించారు. పవన్ ఎక్కడా దాచుకోలేదు. చాలా ఓపెన్ గా తన జీవితంలో ఎవరికీ తెలియని ఎన్నో విషయాల పైన ఓపెన్ అయ్యారు. రాజకీయంగానూ దిమ్మతిగిరే సమాధానాలు ఇచ్చారు. టీడీపీ పై తన అభిప్రాయం స్పష్టం చేసారు. బాలయ్య ఆ సమాధానం తో షాక్ అయ్యారు. ఇక, పవన్ వ్యక్తిగత జీవితం గురించి విన్న బాలయ్య ఇక ఎవరైనా పవన్ కల్యాణ్ గురించి మాట్లాడితే ..అంటూ బాలయ్య వార్నింగ్ ఇవ్వటం ఇక్కడ స్పెషల్.

పవన్ చాలా ఓపెన్ గా - బాలయ్య వార్నింగ్
ఇద్దరు అగ్రహీరోలు ఒకే చోట కలిసారు. ఇద్దరి అభిమానులు ఈ షో పైన భారీ అంచనాలతో ఉన్నారు. ఎక్కడా అంచనాలు తప్పకుండా ఇద్దరు హీరోలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎప్పుడూ బయటకు రాని విషయాలను పవన్ బయటకు చెప్పారు. చాలా ఓపెన్ గా..స్ట్రయిట్ గా తన జీవితంలోని విషయాలను చెప్పేసారు. ఈ ఒక్క షోతో తన పర్సనల్ లైఫ్ పైన విమర్శలు చేస్తున్న వారికి పవన్ సమాధానం ఇచ్చారు. తన వైవాహిక జీవితం లో జరిగిన పరిణామాలు..తన నిర్ణయాల గురించి వివరించారు. ఈ షో ద్వారా విమర్శకులకు కాదు, ప్రజలకు సమాధానంగా పవన్ ఏం జరిగిందో వివరించారు. అన్నయ్య చిరంజీవి, ఫ్యామిలీ తో అనుబంధం గురించి పవన్ చెప్పిన మాటలతో బాలయ్య ఇంప్రెస్ అయ్యారు. ఈ షో నుంచే పవన్ సమక్షంలో బాలయ్య వార్నింగ్ ఇచ్చారు. ఈ సభా ముఖంగా చెప్తున్న...ఇక నుండి పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ మీద వాగే ఎవడైనా ఊర కుక్క తో సమానం అంటూ ఆడియన్స్ హర్షధ్వానాల మధ్య హెచ్చరించారు.

టీడీపీ తో బంధం పై పవన్ సమాధానంతో...
పవన్ పర్సనల్ లైఫ్ తో పాటుగా రాజకీయంగాను బాలయ్య పలు ప్రశ్నలు సంధించారు. ప్రధానంగా టీడీపీతో బంధం పైన వరుస ప్రశ్నలు వేశారు. అధికార పార్టీ వ్యతిరేక ఓటు చీలనవ్వననే వ్యాఖ్యల పరమార్ధం ఏంటని ప్రశ్నించారు. టీడీపీతో పొత్తుపై పవన్ ను నేరుగా సమాధానం ఇవ్వాలని కోరారు. పొత్తుల గురించి తెలియకుండానే సీఎం అవుతానని ఎలా ప్రశ్నిస్తారని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసారు. కానీ, పవన్ చాలా ఓపెన్ గా తన అభిప్రాయాలను స్పష్టం చేసారు. పవన్ ఆలోచనలనే టీడీపీ తొలి నుంచి అమలు చేస్తుంది కదా అంటూ బాలయ్య ప్రశ్నించారు. దీనికి పవన్ తన స్టైల్ సమాధానం ఇచ్చారు. తాను అనుకున్న ఐడియాలజీ మొత్తం టీడీపీలో ఉంటే, తాను కొత్త పార్టీ ఎందుకు పెడతానంటూ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక వర్గం చేితో అధికారం ఉండకూడదు, ఇప్పటి వరకు అధికారం దక్కని వారి రాజ్యాధికారం దక్కించుకోవాలనేది తన లక్ష్యమని పవన్ చెప్పుకొచ్చారు. రైతు కష్టాల్లో ఉంటే పవన్ వారికి అండగా నిలుస్తున్న తీరును బాలయ్య ఈ షో వేదికగా ప్రశంసించారు. 2014లో పోటీ చేయకపోవటం, 2019 ఎన్నికల్లో వైఫల్యం గురించీ పవన్ నొర్మొహమాటంగా జరిగిన తప్పిదాలను..వైఫల్యాల గురించి ఓపెన్ గానే వివరించారు.

షో మధ్యలో మెగా హీరోల సందడి..అకీరా ప్రస్తావన
ఈ షో కేవలం..పవన్ సినిమాలు - రాజకీయాలకే పరిమితం కాలేదు. బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞ ను ప్రత్యేకంగా పిలిపించి కళ్యాణ్ బాబు తో పిక్ ఇప్పించారు. అదే సమయంలో పవన్ కుమారుడు అకీరా గురించి బాలయ్య ప్రస్తావించారు. దీనికి చిరునవ్వుతో స్పందిస్తూ పవన్ తనకు సంగీతం అంటే ఇష్టమని, తనకు ఏది ఇష్టమైతే దానికే సపోర్ట్ ఉంటుందని చెప్పారు. ఇక, షో మధ్య లో సాయిధరమ్ తేజ్ ఎంట్రీ ఇచ్చారు. సాయి ధరమ్ తేజ్ వివాహం గురించి డిస్కషన్ జరిగిందని చెబుతున్నారు. రామ్ చరణ్ .. ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. చూడప్ప సిద్దప్ప డైలాగ్ తో ఆడిటోరియం దద్దరిల్లింది. రాం చరన్ ఫోన్ కాల్ సంభాషణ షో కే స్పెషల్ గా నిలుస్తుందని తెలుస్తోంది. డైరెక్టర్ క్రిష్ సందడి మరో లెవల్. ఇలా.. అటు రాజకీయం..పర్సనల్ లైఫ్ తో పాటుగా మెగా ఫ్యామిలీలో అనుబంధాలు - ఆప్యాయతలతను వివరిస్తూ మధ్యలో సినిమా కబుర్లతో మొత్తంగా ఎమోషనల్ - ఎంటర్ టైనర్ గా బాలయ్య - పవన్ అన్ స్టాపబుల్ షో.. అంచనాలకు మించి అభిమానుల మధ్యకు రాబోతోంది.












Click it and Unblock the Notifications