Unstoppable with NBK3: గెట్ రెడీ ఫ్యాన్స్ - బాలయ్య "మెగా" షో లోడింగ్..!!
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా అన్ స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ రెండు సీజన్లను పూర్తి చేసుకున్న మోస్ట్ ఎవైటెడ్ షో 'అన్ స్టాపబుల్ విత్ NBK సీజన్ 3 లోడ్ అవుతోంది. తనదైన ప్రత్యేకతలతో రెండు సీజన్లను కంప్లీట్ చేసి.. అద్భుతమైన ఆదరణను చూరగొన్న బాలయ్య 'అన్‌స్టాపబుల్' షో ఎప్పటికీ స్పెషల్. సెలబ్రెటీలతో బాలయ్య చేసిన సందడి...రాబట్టిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం ఈ షోకు ఆదరణ పెంచింది. ఇక, ఇప్పుడు సీజన్ -3 కి బాలయ్య సిద్దం అవుతున్నారు. ఈ సీజన్ లో మెగా కాంబో గెస్టుగా ఖాయమైనట్లు సమాచారం.
మూడో సీజన్ కోసం: నందమూరి బాలకృష్ణ మోస్ట్ ఎవైటెడ్ షో 'అన్ స్టాపబుల్ విత్ NBK సీజన్ 3 వచ్చేస్తోంది. రెండు సీజన్లను కంప్లీట్ చేసి.. అద్భుతమైన రెస్పార్స్ తో కొత్త రికార్డులు క్రియేట్ చేసిన అన్ స్టాపబుల్ మూడో సీజన్ కు అంతా సిద్దం అవుతోంది. అన్ స్టాపబుల్ సీజన్ 3కి హోస్ట్‌గా చేసేందుకు అక్టోబర్ 5న బాలయ్య సైన్ చేసినట్లు సమాచారం.

దీంతో, మరోసారి అన్ స్టాపబుల్ విత్ NBK సీజన్ 3 ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ దసరాకి నటసింహం బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో, ఈ సినిమాకు సంబంధించి సీజన్ లో ఒక ఎపిసోడ్ ఉంటుందనే అంచనాలు ఉణ్నాయి. ఇక, ఈ సారి రాజకీయం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి పెంచుతోంది.
మెగా షో తో ఆసక్తి: దీంతో బాలయ్య గతంలో చంద్రబాబు, పవన్ తో సహా పలువురు ప్రముఖుల ఇంటర్వ్యూలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇక, ఈ సారి బాలయ్య షో లో మెగా ప్లాన్ తో ఇప్పటికే నిర్వాహకులు సిద్దం అయ్యారని తెలుస్తోంది.మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక ఎట్రాక్టివ్ స్పెషల్ ఎపిసోడ్ కు ప్లాన్ చేసారని సమాచారం.

చిరంజీవి - రాం చరణ్ ను కలిపి ఒకే ఇంటర్వ్యూలో బాలయ్య ఇద్దరి నుంచి సమాధానాలు రాబట్టేలా ప్రణాళిక సిద్దం అవుతోంది. దీంతో పాటుగా తెలంగాణ మంత్రి కేటీఆర్ తోనూ ఒక ఎపిసోడ్ ను ప్లాన్ చేసినట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల వేళ కేటీఆర్ ఇంటర్వ్యూ పైన ఆసక్తి పెరుగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో బాలయ్య యాక్టివ్ అవుతారని భావిస్తున్న వేళ ఈ ఇంటర్వ్యూ పైన పొలిటికల్ క్యూరియాసిటీ పెరుగుతోంది.
ఎన్నికల వేళ..ఆసక్తిగా: ఇక, పవన్ ఏపీలో రాజకీయంగా కీలకంగా మారిన సమయంలో చిరంజీవిని ఇటు సినిమా..అటు రాజకీయంగా బాలయ్య సంధించే ప్రశ్నలపైన ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి. ఎలక్షన్ సీజన్ కావటం, మరోవైపు చంద్రబాబు అరెస్ట్ వంటి వాటిని రిలేట్ చేస్తూ బాలయ్య ఎవరినైనా ఇంటర్యూకి పిలవనున్నారా అనేది మరింత ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఈ వార్తతో నందమూరి- మెగా అభిమానుల్లో దసరా పండుగ వేళ మరింత జోష్ పెంచుతోంది.












Click it and Unblock the Notifications