ఏపీ సీఎం పవన్ కల్యాణ్- ఊర్వశి రౌతెలాను చెడుగుడు ఆడుతున్న నెటిజెన్లు..!
అమరావతి: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ.. బ్రో. సముద్రఖని దర్శకుడు. తమిళ మూవీ వినోదయ సీతంకు రీమేక్ ఇది. ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం.. ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కింద తెరకెక్కిన ఈ సినిమా ఇవ్వాళ విడుదల కానుంది.
ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగిసింది. హైదరాబాద్ శిల్పారామంలో వందలాదిమంది అభిమానుల మధ్య బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది యూనిట్. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్, సముద్రఖని, బ్రహ్మానందం.. సహా పలువురు నటులు, టెక్నీషియన్లు దీనికి హాజరయ్యారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారు.

ఈ సినిమాలో కామియో రోల్ చేశారు బాలీవుడ్ హాట్ బాంబ్ ఊర్వశి రౌతేలా. చిత్రమంజరి క్యారెక్టర్‌లో నటించారు. మైడియర్ మార్కండేయ పాటలో తళుక్కుమంటూ మెరిశారు. ఈ ఒక్క పాట కోసం భారీగా రెమ్యునరేషన్ చెల్లించారు నిర్మాత. ట్రాక్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ పాట జనం నోళ్లల్లో నానుతోంది.
శిల్పారామంలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఊర్వశి రౌతెలా అటెండ్ అయ్యారు. స్టేజ్ మీద పెద్దగా మాట్లాడలేదు గానీ.. ఆ తరువాతే ఆమె తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసిన ఓ పోస్ట్.. ఇప్పుడు దుమారం రేపుతోంది. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు మండిపడుతున్నారు. ఆమెను ట్రోల్ చేస్తోన్నారు.
దీనికి కారణం లేకపోలేదు. పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిగా సంబోధించారామె. ఈ మేరకు ఆయనకు బెస్ట్ విషెస్ చెబుతూ ఈ ట్వీట్ చేశారు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడం ఆనందంగా ఉంది అంటూ ఆయనను ఆకాశానికెత్తేశారు.

మరణం తరువాత తన తప్పులను తెలుసుకున్న ఓ ఓ గర్విష్ఠి- వాటిని సరిదిద్దుకోవడానికి రెండో ఛాన్స్ పొందడమే ఈ సినిమా సారాంశం అంటూ బ్రీఫ్ చేశారు. 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వందలాది థియేటర్లల్లో సినిమా విడుదలవుతోందని, అక్కడ కలుసుకుందాం అంటూ తన ట్వీట్‌ను ముగించారామె.
పవన్ కల్యాణ్‌ను ఏపీ ముఖ్యమంత్రిగా సంబోధించడం.. వైఎస్ జగన్, వైసీపీ అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌పై ఆమెను చెడుగుడు ఆడుకుంటున్నారు. గతంలో లెజెండ్ తమిళ సినిమా చేసినప్పుడు కూడా హీరో అరుళ్ శరవణన్‌ను కాబోయే తమిళనాడు ముఖ్యమంత్రి అంటూ పొగిడారామె. ఈ వీడియోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications