వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయ ఆత్మహత్యే: సబ్బంపై వాసిరెడ్డి, ఎంతిచ్చారని..

|
Google Oneindia TeluguNews

Vaasireddy Padma fires at Sabbam Hari
హైదరాబాద్: జై సమైక్యాంధ్ర పార్టీ నేత సబ్బం హరిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన, పోటీ నుంచి తప్పుకుని రాజకీయంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.

విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుస్తారంటూ సబ్బం హరి కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆమె అన్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడానన్న సబ్బం హరి, రాష్ట్ర విభజనకు కారకులైన తెలుగుదేశం- బిజెపిలకు మద్దతెలా ఇస్తున్నారని ప్రశ్నించారు.

దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అండతో రాజకీయాల్లో చక్రం తిప్పిన సబ్బం హరి, వైయస్ విజయమ్మపై బురద జల్లడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమని వాసిరెడ్డి పద్మ అన్నారు. విశాఖలోనే కాదు చాలా చోట్ల జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుని టిడిపికి సహకరిస్తున్నారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.

ఇది ఇలా ఉండగా ఎన్నికల పోలింగ్‌కు కొన్ని గంటల ముందు మీడియా సమావేశం పెట్టిన సబ్బం హరిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గుడిమెట్ల రవిరెడ్డి డిమాండ్ చేశారు. సబ్బం హరి పచ్చి అవకాశవాదని దుయ్యబట్టారు. బిజెపి నుంచి ఎన్ని కోట్ల రూపాయలు ముట్టాయని సబ్బం హరిని ఆయన ప్రశ్నించారు. ఎవరెన్న కుట్రలు చేసినా తమ పార్టీ విజయాన్న అడ్డుకోలేరని చెప్పారు.

English summary
YSR Congress Party senior leader Vaasireddy Padma on Tuesday fired at Jai Samaikyandhra Party leader Sabbam Hari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X