పిఠాపురంలో వర్మ రిటర్న్ గిఫ్ట్ - సీన్ రివర్స్..!!
ఏపీలో రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువు తీరి పది నెలలు పూర్తవుతోంది. మూడు పార్టీలు కూటమిగా కొనసాగుతూనే తమ బలం పెంచుకునే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ సీట్లు గెలుచుకోవటం తో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. ఇదే సమయంలో పిఠాపురంలో రాజకీయంగా లెక్కలు మారుతున్నాయి. టీడీపీ నేత వర్మ కు మద్దతు పెరుగుతోంది. ఇక, వర్మకు స్థానికుల నుంచి కొత్త డిమాండ్ వస్తోంది. ఈ పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
అమలు కాని హామీ
పిఠాపురం వర్మ. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అందరిలోనూ చర్చగా మారారు. పిఠాపురం లో పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు నాడు ఎమ్మెల్సీ సీటు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన వెంటే తొలి విడతలోనే ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఆ హామీ అమలు కాలేదు. పవన్ గెలిచారు.. డిప్యూటీ సీఎం అయ్యారు. పవన్ సోదరుడు నాగబాబు సైతం ఎమ్మెల్సీ అయ్యారు.. త్వరలో మంత్రి కాబోతున్నారు. అదే తూర్పు గోదావరి జిల్లాకు చెంది న బీజేపీ నేత సోము వీర్రాజు సైతం ఎమ్మెల్సీ అయ్యారు. అయినా.. వర్మకు మాత్రం ఎమ్మెల్సీ గా అవకాశం రాలేదు.. ఎలాంటి పదవి దక్కలేదు. తాజాగా పిఠాపురంలో జనసేన సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలతో ఒక్క సారిగా వర్మకు నియోజకవర్గంలో మద్దతు పెరిగింది.

మారుతున్న లెక్కలు
పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలతో డిప్యూటీ సీఎం పవన్ అలర్ట్ అయ్యారు. నియోజకవర్గం పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. నియోజకవర్గ పరిధిలో శాంతి భద్రతలతో పాటుగా డెవలప్ మెంట్ కార్యక్రమాల పైన తన కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. అయితే, అసలు వర్మకు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అవుతున్నా పదవి ఎందుకు రాలేదు. ఇప్పటికీ నియోజకవర్గం లో టీడీపీ - జనసేన మధ్య సంధాన కర్త పాత్రకే వర్మ పరిమితం అయ్యారు. వర్మ కు పదవి ఇస్తే పవన్ నియోజకవర్గంలో మరో పవర్ సెంటర్ అవుతుందనే కారణంతోనే దక్కటం లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వర్మ మాత్రం తాను చంద్రబాబు నాయకత్వంలోనే పని చేస్తానని.. నియోజకవర్గానికి సేవ చేయటమే తనకు అసలైన పదవి అని చెబుతున్నారు.
{embed-poll}
వర్మ పోటీ చేయాలంటూ
ఇటు వర్మ మద్దతు దారులు.. జనసేన వర్గీయుల మధ్య నియోజకవర్గంలో గ్యాప్ పెరుగుతోంది. తాజాగా గొల్లప్రోలు మండలంలో రెండు పార్టీల కేడర్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే, పవన్ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన రోజున వర్మ మద్దతు దారులు టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలే ఇప్పటి వరకు పదవి రాక పోవటానికి కారణమనే చర్చ పార్టీలో ఉంది. ఇక, ఇప్పుడు తాజా రాజకీయ సమీకరణాల వేళ స్థానిక మహిళలు వర్మను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కోరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వర్మ 2014లోనూ ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్దిగా గెలుపొందారు. ఇక, ఇప్పుడు వర్మకు నియోజకవర్గంలో పెరుగుతున్న మద్దతు.. తాజా పరిణామాలతో పిఠాపురం రాజకీయం ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications