Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సిగ్గుండాలి, పవన్ చెప్పినా డోన్ట్ కేర్ - వర్మ డైరెక్ట్ ఎటాక్..!!

పిఠాపురం రాజకీయం మరోసారి వేడి పెంచుతోంది. పిఠాపురంలో పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ఇప్పటి వరకు ఎలాంటి పదవి దక్కలేదు. జనసేన కేడర్ నుంచి వర్మకు గౌరవం ఉండటం లేదని చెబుతున్నారు. నాగబాబు జనసేన ప్లీనరీ వేదికగా చేసిన కామెంట్స్ తో వర్మ మనస్థాపానికి గురయ్యారు. నాగబాబు పర్యటనకు వర్మ దూరంగా ఉన్నారు. ఇప్పుడు నియోజకవర్గంలో పరిస్థితు ల గురించి వర్మ కీలక వ్యాఖ్యలు చేసారు. కూటమికి చెడ్డ పేరు వచ్చేలా పరిణామాలు చోటు చేసు కుంటున్నాయంటూ ఓపెన్ గా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

పిఠాపురం వర్మ మరోసారి అసహనం వ్యక్తం చేసారు. నియోజకవర్గంలో ఇసుక మాఫియా చేస్తున్న ఆగడాల గురించి మండిపడ్డారు. పోలీసులకు సిగ్గుండాలని సీరియస్ అయ్యారు. వారికి రేచీకటి ఉన్నట్లుందని.. ఎందుకు కళ్ళు మూసుకుంటున్నారని నిలదీసారు. పోలీసులకు కావాల్సింది వస్తే వాళ్లకి రే చీకటి వస్తుందని ఎద్దేవా చేసారు. రైతు తట్టెడు మట్టి తవ్వుకుంటే నాలుగు రోజులు స్టేషన్ లో ఉంచుతున్నారని ఫైర్ అయ్యారు. అక్రమంగా ఇసుక తరలిస్తుంటే రెవెన్యూ పోలీసులు ఏమి చేస్తున్నారని వర్మ సీరియస్ అయ్యారు. కూటమికి చెడ్డ పేరు వస్తుందంటే ఎవరు ఒప్పుకో రని .. అటువంటి వ్యక్తులు పార్టీలో ఉంటే పంపేస్తారని వ్యాఖ్యానించారు.

vamra-sensational-comments-on-situation-in-pithapuram

ఇప్పటికే ఇసుక తవ్వకాల గురించి పవన్ కళ్యాణ్ హెచ్చరించారని వర్మ గుర్తు చేసారు. రోజుకి 200 లారీలు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. 20 రోజులుగా పలు మార్లు ఫోన్లు చేసానని చెప్పుకొచ్చారు. పవన్ చెప్పినా వినటం లేదని పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే, వర్మ పరోక్షంగా వైసీపీ ఎమ్మెల్యేగా పని చేసి జనసేన లో చేరిన దొరబాబు లక్ష్యంగా ఈ ఆరోపనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దొరబాబు మద్దతు దారులు జనసేన నేతల పేరుతో నియోజకవర్గంలో ఇసుక తవ్వకా లు చేస్తూ.. దోపిడీ చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

దొరబాబు తో పాటుగా జన సేన లో చేరిన వారికి తమ రెండు పార్టీలతో సమానంగా నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలా ల్లో ప్రాధాన్యత ఇవ్వటం వర్మకు రుచించటం లేదు. దీంతో, పార్టీ వేదికల పైన చెప్పాల్సిన అంశా లపైన వర్మ ఓపెన్ గా కామెంట్స్ చేయటం ద్వారా.. ఈ వ్యవహారంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+