త్వరలోనే వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?
మెగా కుటుంబంలో హీరో వరుణ్ తేజ్ మరోసారి పెళ్లి ముచ్చటతో వార్తలకెక్కాడు. జూన్ లో తనకు నచ్చిన అమ్మాయితో వరుణ్ ఎంగేజ్ మెంట్ చేసుకుంటాడని వార్తలు వస్తున్నాయి. కుదిరితే ఈ ఏడాది చివరలో పెళ్లి జరుగుతుందని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వరుణ్ తేజ్ వివాహం చేసుకోబోయేది ఎవరినోకాదు.. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠినే. వీరిద్దరి పెళ్లికి ఇరువైపులా కుటుంబాలు అంగీకారం తెలపవడంతో వచ్చే నెలలో సన్నిహితుల మధ్య ఎంగేజ్ మెంట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడంటూ ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. మిస్టర్, అంతరిక్షం సినిమాల సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది. లావణ్య పుట్టినరోజును సెలబ్రేట్ చేసేందుకే వరుణ్ తేజ్ బెంగళూరు వెళ్లాడంటూ ఆ సమయంలో వార్తలు వచ్చాయి. అక్కడే ఆమెకు ప్రపోజ్ చేశాడంటూ మరో వార్త వచ్చింది. ఈ వార్తలపై మెగా కుటుంబం నుంచి ఎవరూ స్పందించలేదు. అయితే లావణ్య త్రిపాటి మాత్రం స్పందించింది. తాను బెంగళూరులో లేనని, తన సొంతూరు డెహ్రాడూన్ లో కుటుంబ సభ్యులతో కలిసివున్నానంటూ అక్కడి ఫొటోలను షేర్ చేసింది. ఎంగేజ్ మెంట్ వార్తలపై లావణ్య స్పష్టతనివ్వడంతో ఈ రూమర్స్ కు చెక్ పడినట్లైంది.

వరుణ్ తండ్రి నాగబాబు ఇటీవలే మీడియాతో మాట్లాడారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటాడని, అమ్మాయి ఎవరనేది తనే వెల్లడిస్తాడని చెప్పారు. అప్పటి నుంచి వరుణ్ తేజ్ మీడియాకు ఎవరిని పరిచయం చేస్తాడో చూడాలనే ఆసక్తి సినీ పరిశ్రమతోపాటు అభిమానుల్లో కూడా నెలకొంది. లావణ్య తో వరుణ్ ఎంగేజ్ మెంట్ ఫిక్స్ అయిందంటూ పింక్ విల్లా ఓ కథనాన్ని ప్రచురించింది. మెగా కుటుంబం నుంచి అధికారికంగా ఒక ప్రకటన వస్తేనే వీటిల్లో నిజం ఏమిటనేది తెలుస్తుంది.












Click it and Unblock the Notifications