Varun Tej - Lavanya Wedding: అచ్చం తెలుగింటి ఆడపడుచులా పవన్ సతీమణి..!!
మెగా కుటుంబం మొత్తం ఒకే వేదిక మీదకు వచ్చింది. మెగా ఫ్యామిలీ ఒకే ఫ్రేమ్ లో కనిపించటం ఫ్యాన్స్ అవుతున్నారు. వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠీ నిజ జీవితంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఆరేళ్ల తమ ప్రేమను ఇటలీలోని టస్కానీ వేదికగా వివాహబంధంగా మార్చుకున్నారు. ఈ సందర్భంలో మెగా బ్రదర్స్, అక్క చెల్లెల్లు అందరూ ఒక గ్రూపులో వున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ -అన్నా లెజెనోవా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మెగా వెడ్డింగ్ ఎన్నో ప్రత్యేకలతో సాగింది. ఈ మెగా వేడుకలో చిరంజీవి అన్నదమ్ములు, అక్క చెల్లెల్లు అందరూ కలిపి ఒక గ్రూప్ ఫోటోకి పోజు ఇచ్చారు. అందులో పవన్ కళ్యాణ్ భార్య కూడా వున్నారు. ఈ ఫొటోలో మెగా స్టార్ చిరంజీవి -సురేఖ, నాగబాబు-పద్మజ, పవన్ కళ్యాణ్ -అన్నా లెజెనోవా అలాగే మెగా సిస్టర్స్ విజయ దుర్గ, మాధవి వారి భర్తలతో వున్న గ్రూపు ఫోటో వైరల్ అవుతోంది. ఇది రేర్ ఫోటో అంటూ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. ఇలా అందరూ కలిసిన అరుదైన కలయిక కావటంతో ఈ ఫొటో బాగుందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక, ఈ ఫొటోలో మరో ప్రత్యేకత ఉంది. పవన్ కళ్యాణ్భార్య అన్నా లెజెనోవా అయితే అచ్చం తెలుగింటి ఆడపడుచులా చీరలో కనిపించి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ వివాహం గురించి చాలామంది ఏదేదో మాట్లాడారు, అవన్నీ పటాపంచలు చెయ్యడానికి కూడా ఈ ఒక్క ఫోటో చాలంటూ ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవున్నారు. వరుడు వరుణ్ తేజ్ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన క్రీమ్ - గోల్డ్ షేర్వానీని వివాహా వేడుకకు ధరించారు. ఎరుపు రంగు కాంచీపురం చీరను లావణ్య ధరించారు. వివాహ మండపం వద్దకు వరుణ్ తేజ్ గ్రాండ్‍గా ఓ వింటేజ్ కన్వర్టబుల్ కారులో వచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్ సహా మెగా, అల్లు హీరోలందరూ ఈ వేడుకలో సందడి చేసారు. అక్టోబర్ 30న ఈ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. పెళ్లి మండపానికి వరుణ్ తేజ్ వచ్చే వీడియోలు మాత్రం వైరల్ గా మారాయి.వరుణ్ తేజ్ - లావణ్య వెడ్డింగ్ కు ఇరువైపు కుటుంబాల సభ్యులు, అతి తక్కువమంది సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. హీరో నితిన్ భార్య షాలినీతో కలసి ఈ పెళ్లికి హాజరయ్యారు. ఈ నెల 5న హైదరాబాద్‌లోని ఎన్. కన్వెన్షన్‌లో వరుణ్‌తేజ్, లావణ్యల రిసెప్షన్ జరుగుతుంది.












Click it and Unblock the Notifications