రామ్ చరణ్ - ఉపాసన కుమార్తెపై వేణుస్వామి జ్యోతిష్యం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన జంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందింది. అటు మెగా కుటుంబంలోనూ, ఇటు అభిమానుల్లో ను అంబరాలు మిన్నంటాయి.ఉపాసనకు శుభగడియల్లో పాప జన్మించిందని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. మంగళవారం తెల్లవారుజామున 1.46 గంటలకు ఉపాసనకు పాప పుట్టింది. మా అందరికీ ఇష్టమైన మంగళవారం రోజే మనువరాలు జన్మించడం ఆనందంగా ఉందని చిరంజీవి వ్యాఖ్యానించారు.
కొద్దిరోజులుగా తమ ఇంట్లో శుభకార్యాలు జరుగుతుండటం సంతోషంగా ఉందన్నారు. వరుణ్ తేజ్ నిశ్చితార్థం అయిన తర్వాత వెంటనే ఆడబిడ్డ తమ ఇంట్లోకి అడుగుపెట్టిందన్నారు. పాప జాతకంపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సెలబ్రిటీలకు జ్యోతిష్యం చెప్పే వేణుస్వామి ఆ పాప జాతకాన్ని విశ్లేషించారు. పునర్వసు నక్షత్రం 2వ పాదం, మిధున రాశిలో జన్మించిందని, జన్మ నామం కోనంగి అని వెల్లడించారు. రాంచరణ్ రాశి రోహిణి అని, ఉపాసన రాశి క్రుతిక అని, జన్మించిన పాపది పునర్వసు నక్షత్రం అని, ఈ ముగ్గురి నక్షత్రాలు దేవత అంశ కలిగినవన్నారు. మెగా కుటుంబంలో ఈ పాప వల్ల రాజయోగం ఉందని, చిరంజీవి ఇంట్లో ఇకనుంచి శుభఘడియలకు కొదవే ఉండదన్నారు.

మెగా ప్రిన్సెస్ జాతకంలో రాజయోగం ఉట్టిపడుతోందని, అచ్చం చిరంజీవి జాతకంలో ఉన్నటు వంటి గురుచండాలయోగమే.. ఈ పాప జాతకంలో కూడా ఉందని వేణుస్వామి తెలిపారు. చిరంజీవిలాగే పాపది కూడా చరిత్ర సృష్టించే జాతకమని, చిరంజీవితోపాటు, రాంచరణ్, ఉపాసనల కంటే ఎక్కువ పేరు సంపాదించుకుంటుందన్నారు. అలాగే పాప జాతకంలో కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయని, పంటి, చెవులు, నరాలకు సంబంధించిన చిన్నచిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అయితే, గురుచండాల యోగం వల్ల రాంచరణ్, ఉపాసనలకు తదుపరి సంతానం ఉండకపోవచ్చని, ఈ జాతకంలో కేవలం సింగిల్ చైల్డ్‌గా ఉందని, రాంచరణ్ జాతకంలో మగ సంతానం ఉండకపోవచ్చన్నారు.












Click it and Unblock the Notifications