కవిత అరెస్ట్ విషయంలో వేణు స్వామి జాతకమే నిజం అయింది
పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో పార్టీ అధినేత కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. ఈడీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మద్యం కేసులో హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఈడీ అధికారులు సోదాల అనంతరం ఆమెను అరెస్టు చేస్తున్నట్టు నోటీసులు జారీ చేశారు.
కవితకు సంబంధించిన ఫోన్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కవిత అరెస్ట్‌పై బీఆర్ఎస్ వర్గాలు భగ్గుమన్నాయి. కోర్టులో కేసు ఉండగా సడెన్‌గా సోదాలు జరపడంపై బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో కవిత ఇంటికి చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు..ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ఈడీ అధికారులను ప్రశ్నించారు.

భారీ బందోబస్త్ మధ్య కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఢిల్లీకి తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గతంలో చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో వేణు స్వామి మాట్లాడుతూ..కవిత జాతకంలో కచ్చింతంగా జైలుకు వెళ్లే యోగం ఉందని ఈ వీడియోలో వేణు స్వామి తెలిపారు.
2024 లో కవిత అరెస్ట్
— AP360 (@andhraa360) March 15, 2024
2023 లో కెసిఆర్ ఓటమి
2024 లో బాబు గెలవడు
ఒకే ఒక్కడు - వేణు స్వామి#CBN #Kavitha #AndhraPradesh https://t.co/ocL61Zq58n pic.twitter.com/LvOHPA3E30
అది లిక్కర్ స్కాంలోనా లేదా మరో కేసులోనా అనేది నేను చెప్పలేను కానీ కవిత అయితే జైలుకు వెళ్లడం ఖాయమని వేణు స్వామి గతంలోనే తేల్చి చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పిన విధంగానే కవిత లిక్కర్ స్కాంలో అరెస్టయ్యారు. కవిత గురించి వేణు స్వామి చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇటు కవిత అరెస్ట్‌పై బీఆర్ఎస్ పార్టీ ఎలా ముందుకు వెళ్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications