రఘురామ భవిష్యత్తు రెండేళ్ల క్రితమే చెప్పిన వేణు స్వామి(వీడియో)
ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ , రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారాయన. ఆయన చెప్పనవి చెప్పినట్టుగా జరగడంతో.. వేణు స్వామిని ఫాలో అయ్యేవారి సంఖ్య ఎక్కువైంది. నాగ చైతన్య, సమంత , నిహారిక, ఇలా పలువరు సినీ తారలు వీడిపోతారని.. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోతుందని ముందే చెప్పి సంచలనం సృష్టించారు. రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ గురించి ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించకున్నారాయన.
దీంతో సోషల్ మీడియాలో వేణు స్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్‌లో క్రేజ్ పెరిగింది. సెలబ్రిటీలు సైతం ఆయనతో పూజలు చేయించుకోవడం మొదలుపెట్టారు. డింపుల్ హాయతి, రష్మిక, నిధి ఆగర్వాల్ వంటి హీరోయిన్లు వేణు స్వామి చేత జాతక దోష నివారణ పూజలు చేయించుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రాజకీయ నేతలపై కూడా ఆయన చెప్పినవి జరగడంతో సోషల్ మీడియాలో వేణు స్వామి పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు.

టీడీపీ అధినేత చంద్రబాబు 2023లో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారని ముందే వేణు స్వామి చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే చంద్రబాబు స్కిల్ స్కాంలో అరెస్ట్ అయ్యారు. . కవిత జాతకంలో జైలుకు వెళ్లే యోగం ఉందని వేణు స్వామి ముందే చెప్పారు.వేణు స్వామి చెప్పిన కొద్ది రోజుల్లో లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ అయ్యారు. ఏపీలో జగన్ తిరిగి సీఎం అవుతారని గతంలోనే చెప్పారాయన.
తాజాగా వేణు స్వామి గతంలో వైసీపీ వివాదాస్పద ఎంపీ రఘురామ కృష్ణం రాజు గురించి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 2021లోనే వేణుస్వామి ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూలో ఎంపీ రఘురామ రాజకీయ జీవితంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రఘురామ ఇక ఎంపీగా గెలుపొందడం కష్టమేనని వేణుస్వామి చెప్పుకొచ్చారు. రఘురామ జాతక రీత్యా తర్వాతి టర్మ్‌లో ఎంపీ అయ్యే అవకాశం లేదన్నారు.
ఆయన జాతకం తనకు తెలుసునని రఘురామ మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే యోగం లేదని వేణుస్వామి చెప్పుకొచ్చారు. వేణు స్వామి చెప్పిన మాదిరిగానే రఘురామ రాజకీయ జీవితం అయోమయంలో ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు హ్యాండ్ ఇవ్వడంతో ఆయన పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడింది. రెండేళ్ల ముందే వేణుస్వామి రఘురామ భవిష్యత్‌పై అంచనా వేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications