ప్రభాస్ సినిమా 'ఆదిపురుష్' పై వేణుస్వామి జాతకం
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాష్ తాజాగా ఆదిపురుష్ అనే భారీ చిత్రాన్ని చేశారు. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ సినిమాపై అంచనాలున్నాయి. ఈనెల 16వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. సినీ స్టార్లు, ఇతర సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన వేణుస్వామి తాజాగా ఆదిపురుష్ సినిమా గురించి కూడా జోస్యం చెప్పారు. కొన్ని షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు.
అందరూ ఊహిస్తున్నట్లుగా ఆదిపురుష్ సినిమా హిట్ అవదని, యావరేజ్ గా నిలుస్తుందని వేణుస్వామి కుండ బద్ధలు కొట్టారు. ప్రభాస్ జాతకం ప్రకారం ఆదిపురుష్ భారీ విజయాన్ని నమోదు చేసే అవకాశమే లేదన్నారు. బాహుబలి రేంజ్ లో ఏమాత్రం ఊహించుకోవాల్సిన అవసరం లేదని, హిందూ మతానికి సంబంధించిన సినిమా అయినప్పటికీ, రామాయణాన్ని తీసినప్పటికీ సినిమా మాత్రం గొప్ప హిట్ అవదన్నారు.

ప్రభాస్ సినిమాకి రూ. 150 కోట్లు తీసుకుంటాడా? లేదా? అనేది ఆయనిష్టమని, ప్రతి సినిమా భారీ హిట్ అవ్వాలని ఏం లేదన్నారు. సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఎంత పెట్టి తీశారు? ఆ సినిమాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రస్తుతానికి ఆయనకు డిమాండ్ ఉంది కాబట్టి నడుస్తుందని, అంతమాత్రాన ఆదిపురుష్ మాత్రం బీభత్సంగా హిట్ అయ్యిందనే రీతిలో అయితే ఉండదని తేల్చిచెప్పారు. ఇదంతా ప్రభాస్ జాతకం ప్రభావమేనన్నారు.
విజువల్ గ్రాండియర్ గా ఆదిపురుష్ నిలవనుందని చిత్ర యూనిట్ తోపాటు ప్రభాస్ అభిమానులు కూడా భారీగా ఆశలు పెట్టుకున్నారు. అయితే తాజాగా వేణుస్వామి వ్యాఖ్యలు వారి ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఫ్యాన్స్ అంచనాలు అందుకుంటామనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో షేకవుతోంది. రికార్డుస్థాయిలో వ్యూస్ రాబట్టింది. దేశవ్యాప్తంగా ప్రభాస్ ప్రభంజనం ఉంటుందని ఆయన అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications