Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూట్యూబర్ అన్వేష్ కు షాక్.. శివాజీ వ్యాఖ్యలపై స్పందించిన వీడియోపై పోలీసులకు ఫిర్యాదు!

యూట్యూబ్ అన్వేష్ నా అన్వేషణపై విశాఖపట్నంలోని గోపాలపట్నం పోలీసులకు విశ్వ హిందూ పరిషత్ ఒక ఫిర్యాదు చేసింది. హిందూ దేవతలు మరియు భారతీయ మహిళల వస్త్రధారణ పైన అన్వేష్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని అతనిపైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ తమ ఫిర్యాదు లేఖలో ఆరోపించింది. అన్వేష్ చేసిన వ్యాఖ్యలు సమాజంలో తీవ్రమైన అశాంతిని రేకెత్తిస్తాయి అని విశ్వహిందూ పరిషత్ నేతలు పోలీసులకు రాసిన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.

మహిళలను, దేవతలను కించపరిచేలా అన్వేష్ మాటలు
నటుడు శివాజీ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మాట్లాడిన అన్వేష్ మహిళలను కించపరిచేలా మాట్లాడారంటూ వారి పేర్కొన్నారు. అన్వేష్ మాట్లాడుతూ ఆలయాలలో ఉన్న శిల్పాలపైన ప్రపంచ హిందువులంతా దేవతగా కొలిచే సీతమ్మవారిని, ద్రౌపదిని ఉదాహరించి, వారి కాలంలో వారిని రేప్ చేశారని అవహేళన చేస్తూ భారతీయ మహిళలు హిందూ సాంప్రదాయాల పైన విసుగెత్తి విదేశాలకు వెళ్ళిపోతున్నారు అంటూ మాట్లాడారు.

VHP Files Police Complaint Against YouTuber Anvesh Over Objectionable Remarks on women dressing

భారతీయ సనాతన సంస్కృతిని కించపరుస్తూ అన్వేష్ వీడియో
మహిళా మూర్తులను పుచ్చకాయతో పోల్చి, కీరా దోసకాయ చూపిస్తూ దారుణంగా ఉదాహరిస్తూ అసభ్యకరంగా ప్రదర్శిస్తూ వివిధ మతాల స్త్రీల వస్త్రాల విధానం పైన వ్యాఖ్యలు చేసారు. భారతీయ సనాతన ధర్మ సంస్కృతిని కించపరుస్తూ మాట్లాడిన మాటల పైన విశ్వహిందూ పరిషత్ ఫిర్యాదు చేస్తూ, తక్షణమే అతనిని అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ నేతలు డిమాండ్ చేశారు.

యూట్యూబ్ ఛానల్ బ్యాన్ కు డిమాండ్, పోలీసులకు ఫిర్యాదు
ఇక అన్వేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో హిందూ ధర్మాన్ని పాటించే నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో దీనిపైన విస్తృతంగా చర్చ జరుగుతున్న పరిస్థితులలో రంగంలోకి దిగిన విశ్వహిందూ పరిషత్ నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అన్వేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు లేఖతో పాటు, అన్వేష్ మాట్లాడిన మాటల వీడియోను కూడా పోలీసులకు అందించారు. తెలుగు రాష్ట్రాలలో అతనిపైన మరిన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామని ప్రభుత్వం వెంటనే అతనిపైన చర్యలు తీసుకోవాలని వీహెచ్పి నేతలు డిమాండ్ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+