మాల్యాతో పోల్చుతావా, పరిటాల నుంచి ఇవీ మీ నేరాలు, నువ్వో చార్లెస్ శోభరాజ్: బాబుని కడిగేసిన విజయసాయి

Recommended Video

    టిడిపి చాలెంజ్ కి విజయసాయిరెడ్డి కౌంటర్, చంద్రబాబు గజ నేరస్తుడు, చార్లెస్ శోభరాజుకు సమానం

    అమరావతి/న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబుకు చితశుద్ధి లేదని, అందుకే తాము అఖిలపక్ష సమావేశానికి వెళ్లలేదని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి మంగళవారం నిప్పులు చెరిగారు. తనను నేరస్తుడు అని చంద్రబాబు, టీడీపీ అనడంపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబును కడిగిపారేశారు.

    ప్రత్యేక హోదా విషయంలో ప్రజా ఉద్యమం, టీడీపీపై ప్రజల వ్యతిరేకత చూసి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, ఏపీ చరిత్రలో ఆయన ద్రోహిగా మిగిలిపోతారన్నారు. నన్ను విజయ్ మాల్యాతో పోలుస్తారా అని మండిపడ్డారు.

    టీడీపీ నేతలు దొంగలు అని, చంద్రబాబు గజ నేరగాడు అని, నిజం చెప్పాలంటే బ్యాంకులను టీడీపీ నేతలే దోచుకున్నారని, ప్రపంచంలోనే అతిపెద్ద నేరగాడు చార్లెస్ శోభరాజుకు చంద్రబాబు సమానం అని తీవ్రంగా మండిపడ్డారు. ఏపీకి కేంద్రం ద్రోహం చేయాలని చూస్తోందన్నారు.

    అవిశ్వాసం ఇచ్చాక బీజేపీని కలవలేదు, బాబుకు చిత్తశుద్ధి లేదు

    అవిశ్వాసం ఇచ్చాక బీజేపీని కలవలేదు, బాబుకు చిత్తశుద్ధి లేదు

    అవిశ్వాసం నోటీసు ఇచ్చిన తర్వాత తమ పార్టీ సభ్యులు బీజేపీని కలవలేదని చెప్పారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదా విషయంలో చిత్తశుద్ధి లేదని విజయ సాయి రెడ్డి అన్నారు. ఏపీకి హోదా వద్దు, ప్యాకేజీ చాలని ఆయన పలుమార్లు మాట మార్చారన్నారు. బాబు నేతృత్వంలోని అఖిల పక్షానికి చిత్తశుద్ధి ఉండదన్నారు. అందుకే తాము హాజరు కాలేదని చెప్పారు.

    కుక్క మొరిగినట్లు, యూటర్న్ అంకుల్

    కుక్క మొరిగినట్లు, యూటర్న్ అంకుల్

    ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు తీరు దొంగతనం జరిగిన ఆరు నెలలకు కుక్క మొరిగినట్లుగా ఉందని విజయసాయి ఎద్దేవా చేశారు. హోదా కోసం ఏపీ ప్రజలు అందరూ గళమెత్తుతున్న సమయంలో చంద్రబాబు నిద్ర లేచారన్నారు. ఆయన యూటర్న్ తీసుకున్నారని, యూటర్న్ అంకుల్ అని ఎద్దేవా చేశారు. హోదా కోసం తాము నాలుగేళ్లుగా పోరాడుతున్నామని చెప్పారు.

     ఏపీకి ద్రోహం చేసిన వ్యక్తిగా మిగిలిపోతాడు, బాబు పెద్ద నేరగాడు

    ఏపీకి ద్రోహం చేసిన వ్యక్తిగా మిగిలిపోతాడు, బాబు పెద్ద నేరగాడు

    ఏపీకి ద్రోహం చేసిన వ్యక్తిగా చంద్రబాబు మిగిలిపోతాడని విజయ సాయి రెడ్డి అన్నారు. ఏపీలో కేవలం ఇసుక మాఫియానే కాదని, ఎంతో జరుగుతోందన్నారు. చంద్రబాబే ఓ నేరగాడు అన్నారు. కొన్ని కేసుల్లో స్టే తెచ్చుకున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ఎలా మేనేజ్ చేసుకున్నాడో ఆయనకే తెలుసునని చెప్పారు. చంద్రబాబుకు మనస్సాక్షి ఉంటే కోర్టు ఎదుట నిలబడారని, ప్రజల ముందు నిలబడి తప్పు లేదని నిర్ధారించుకోవాలన్నారు. పోరెన్సిక్ ఇప్పటికే తేల్చిందన్నారు.

     పరిటాల రవి నుంచి.. ఇదీ మీ నేర చరిత్ర

    పరిటాల రవి నుంచి.. ఇదీ మీ నేర చరిత్ర

    టీడీపీలోని శాసన సభ్యులు, ఎంపీలు ఎందరో నేరగాళ్లు అని విజయ సాయి రెడ్డి అన్నారు. టీడీపీ అంటేనే తెలుగు దొంగల పార్టీ అన్నారు. పరిటాల రవి.. వందల హత్యలు చేసిన వ్యక్తి అని, గతంలో వారి ఎమ్మెల్యే అన్నారు. చింతమనేని ప్రభాకర్‌కు కింది కోర్టు రెండేళ్ల శిక్ష విధించిందన్నారు. కోర్టు శిక్ష విధించినా ఆయన శాసన సభ్యుడు అన్నారు.

     పేకాట క్లబ్.. వదినను చంపి.. టీడీపీ నేరాలు కోకొల్లలు

    పేకాట క్లబ్.. వదినను చంపి.. టీడీపీ నేరాలు కోకొల్లలు

    జమ్మలమడుగు నుంచి బెంగళూరులో పేకాట క్లబ్బులు నిర్వహించే వ్యక్తి చంద్రబాబు కేబినెట్లో మంత్రి అని ధ్వజమెత్తారు. తన వదినను చంపి ఎమ్మెల్యే కావాలనుకున్న దురుద్దేశపూరిత వ్యక్తి మంత్రిగా ఉన్నారన్నారు. టీడీపీ నేరాల జాబితా చెప్పాలంటే కోకొల్లలు అన్నారు.

     నన్ను మాల్యాతో పోలుస్తావా, నేరగాడు అంటావా

    నన్ను మాల్యాతో పోలుస్తావా, నేరగాడు అంటావా

    టీడీపీలోని చాలామంది శాసన సభ్యులు, ఎంపీలు నేరగాళ్లు అని విజయ సాయి రెడ్డి అన్నారు. ఆ నేరగాళ్లకు అధినేత గజనేరగాడు చంద్రబాబు అన్నారు. నన్ను నేరగాడు అంటావా.. నన్ను విజయ్ మాల్యాతో పోలుస్తావా, నేను బ్యాంకులను మోసం చేశానా.. అని చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు.

    సుజనను లాగి.. చంద్రబాబు చార్లెస్ శోభరాజ్‌తో సమానం

    సుజనను లాగి.. చంద్రబాబు చార్లెస్ శోభరాజ్‌తో సమానం

    నిజం చెప్పాలంటే బ్యాంకులను దోచింది ఆయన పార్టీ నేత సుజనా చౌదరి అని విజయసాయి అన్నారు. ఈ సందర్భంగా కోర్టుకు హాజరు కానీ తేదీలు చెబుతూ.. సుజనకు నాన్ బెయిలబుల్ వారెంట్ వస్తే.. కోర్టుకు హాజరై బెయిల్ తెచ్చుకున్నారని విమర్శించారు. నేను ఏ బ్యాంకులోను లోన్ తీసుకోలేదన్నారు. ప్రపంచంలోని గజదొంగ చార్లెస్ శోభరాజ్ అని, ఆయనతో సమానం చంద్రబాబు అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+