లోకేష్ పై చంద్రబాబుకు విజయసాయి రెడ్డి సెటైర్ ... కుమారుడు విప్లవ యోధుడిలా కనిపించి ఉంటాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని, అలాగే లోకేష్ ని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు నాయుడు సమాంతర పాలన భ్రాంతిలో బ్రతుకుతున్నాడు అని,ద్రవ్య వినిమయ బిల్లులు కౌన్సిలర్ అడ్డుకోవడం ద్వారా తాత్కాలిక ఆనందం పొందారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక ఇటువంటి ఉపశమనాలతో బండి లాక్కొస్తున్నాడంటూ విజయసాయి వ్యాఖ్యలు చేశారు.

వీడియోలు తీసి సభా మర్యాదలు ఉల్లంఘించిన కుమారుడు

వీడియోలు తీసి సభా మర్యాదలు ఉల్లంఘించిన కుమారుడు

చంద్రబాబు తన కుమారుడు లోకేష్ విప్లవయోధుడు కనిపిస్తున్నాడు అంటూ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. శాసనమండలిలో వీడియోలు తీసి సభా మర్యాదలు ఉల్లంఘించిన కుమారుడు విప్లవయోధుడు అని విజయసాయి మండిపడ్డారు. ప్రజలు చంద్రబాబును, ఆయన తనయుడిని ఛీ కొడుతున్నారని పేర్కొన్నారు. ఇక మరో ట్వీట్ లో తమ పార్టీ నేతలు 100 కోట్లు కుంభకోణాలు,ఫోర్జరీ, మోసం కేసులో అరెస్టయితే సిగ్గు పడాల్సింది పోయి మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తున్నారు నాయుడు బాబు అంటూ విజయసాయి రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేసి మాటల తూటాలు పేల్చారు.

వారి హక్కులకు భంగం ఎలా కలిగిందో

వారి హక్కులకు భంగం ఎలా కలిగిందో

స్వార్థబుద్ధితో నేరాలకు పాల్పడి కేసుల్లో ఇరుక్కున్న వారి హక్కులకు భంగం ఎలా కలిగిందో చంద్రబాబు ప్రజలకు జవాబు చెప్పాలంటూ ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుకు యాదవుల అంటే యనమల ఆయన వియ్యంకుడి కుటుంబాలే కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. దోచుకోమని అందుకే తాళాలు అప్పగించాలంటూ విమర్శలు గుప్పించారు. తిరుపతిలో సన్నిధి గొల్ల వంశపారంపర్య హక్కులు తొలగించింది అందుకేనేమో అని పేర్కొన్న విజయసాయిరెడ్డి సీఎం జగన్ గారు దానిని పునరుద్ధరించడమే కాక సన్నిధి యాదవ అని పేరు మార్చి కూడా గౌరవించారు అంటూ చంద్రబాబును టార్గెట్ చేసి విరుచుకుపడ్డారు విజయసాయి రెడ్డి.

దళితులను పనిగట్టుకుని అవామానిస్తున్నారు

దళితులను పనిగట్టుకుని అవామానిస్తున్నారు

ఇక అంతే కాదు దళితులను పనిగట్టుకుని అవమానిస్తున్నారు చంద్రబాబు అంటూ సాయి రెడ్డి రాజ్యసభ ఎన్నికల విషయంలో పేర్కొన్నారు. గెలిచే ఛాన్స్ లేదని తెలిసినందువల్లనే పోటీలో పెట్టారని,గతంలోనూ చంద్రబాబు ఇదేవిధంగా పుష్ప రాజ్,నర్సింహులును అవహేళన చేశారని విమర్శలు గుప్పించారు పదవి దక్కుతుంది అంటే కనకమేడల లాంటి మీ వాళ్లని బరిలోకి దింపుతారని,ఓటమి తప్పదని బలహీన వర్గాల వారిని బలి చేస్తారా అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+