తాగి అసభ్య నృత్యాలు: దుర్గగుడి అర్చకుడు సస్పెండ్
విజయవాడ: పవిత్రమైన అర్చక వృత్తిలో ఉంటూ అసభ్య నృత్యాలు చేస్తూ దొరికిపోయిన ఓ పూజారి సస్పెండ్‌కు గురయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా సీతానగరంలో విజయవాడ కనకదుర్గ దుర్గగుడి దత్తత ఆలయంలో అర్చకుడిగా చెరువు కాశీవిశ్వనాథశాస్త్రి పని చేస్తున్నాడు.

హనుమాన్ జయంతి రోజున వేదికపై తప్పతాగి అర్థనగ్నంగా అశ్లీల గీతాలతో పాటు అసభ్య నృత్యాలు చేశాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు అర్చకుడిపై కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన దుర్గ గుడి ఈఓ విచారణ జరిపించి ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేల్చారు.
దీంతో వెంటనే చెరువు కాశీవిశ్వనాథశాస్త్రిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications