వీడియో: ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇరుక్కున్న బోట్లు: దెబ్బతిన్న గేట్లు?

Vijayawada floods 2024: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో దంచికొట్టిన అతి భారీ వర్షాల తీవ్రత ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. మరింత పెరుగుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తుతోంది. దీని ప్రభావం ప్రకాశం బ్యారేజీ తీవ్రంగా పడింది.

బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. విజయవాడ, అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. అటు కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల వరద తాకిడికి గురైంది కృష్ణమ్మ. దాని తీవ్రత ఇంకా తగ్గట్లేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్ల గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.

Vijayawada floods 2024 Gates at Prakasam Barrage Damaged as hits by the boats downstream

శ్రీశైలం రిజర్వాయర్ వద్ద ఇన్ ఫ్లో 3,56,024 క్యూసెక్కులు. కాగా అవుట్ ఫ్లో 5,00,397 క్యూసెక్కులుగా నమోదైంది. నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 4,61,245 మేర ఉండగా.. అవుట్ ఫ్లో 4,53,700 క్యూసెక్కులు. పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 3,39,434, ఔట్ ఫ్లో 3,14,434 క్యూసెక్కులు ఉంటోంది.

వాటి తీవ్రత ప్రకాశం బ్యారేజీపై పడింది. ఇన్‌ఫ్లో తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో 11,25,876 క్యూసెక్కులుగా నమోదైంది. వచ్చిన వరద నీటిని వచ్చినట్లుగా విడుదల చేస్తోన్నామని వివరించింది. అవుట్ ఫ్లో కూడా 11,25,876 క్యూసెక్కులుగా ఉన్నట్లు పేర్కొంది.

Vijayawada floods 2024 Gates at Prakasam Barrage Damaged as hits by the boats downstream

ఇన్‌ఫ్లో మరింత పెరగొచ్చని, 12 లక్షల క్యూసెక్కుల వరకు వరద రావొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. దీనికి అనుగుణంగా అధికారులు ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోన్నారు. ప్రకాశం బ్యారేజీ నిర్మాణం తరువాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ వరద తాకిడికి యనమలకుదురు, రామలింగేశ్వరనగర్ వంటి విజయవాడ శివారు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జనం తీవ్రంగా అవస్తల పాలవుతున్నారు. భవానీ ఐలండ్, బెర్మ్ పార్క్ నీట మునిగాయి.

వరద ప్రవాహం ధాటికి భారీ ఫిషింగ్ బోట్లు కొట్టుకుని రావడం కనిపించింది. మూడు నుంచి నాలుగు బోట్లు బ్యారేజీ గేట్లను బలంగా ఢీ కొట్టి అక్కడే ఆగిపోయాయి. అవి ఢీ కొట్టిన తాకిడికి గేట్లు చైన్లు, గోడలు దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+