విజయవాడ దుర్గమ్మ భక్తులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్..!

ఏపీలోని ప్రధాన ఆలయాల్లో ఒకటైన విజయవాడ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై భక్తుల కోసం దేవస్థానం ఓ ఆఫర్ ఇస్తోంది. దుర్గమ్మ భక్తులు అమ్మవారికి స్వచ్చంధంగా సేవ చేయాలని ఉన్న ఆసక్తి ఉంటే వారి కోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తోంది. ఈ మేరకు ఇవాళ ఆలయ కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ కీలక ప్రకటన చేశారు. దుర్గ గుడిలో సేవ చేయాలనుకునే భక్తులకు ఇదే మంచి అవకాశమని ఆయన తెలిపారు.

కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో భక్తి తత్వంతో సేవ చేయాలనే వారికి, భక్త బృందాలకు సేవ చేసేందుకు వీలుగా వారికి అవకాశం కలిగించేందుకు దుర్గ గుడి ఈవో శీనా నాయక్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. అమ్మవారి ఆలయంలో సేవ చేద్దామని భావిస్తున్న భక్తులు తమ పూర్తి వివరాలు తెలియజేస్తూ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా దుర్గగుడి అధికారులు ఆన లైన్ లో అవకాశం కల్పిస్తున్నారు.

Vijayawada kanakadurga temple offers volunteers registrations for free service to goddess

దుర్గమ్మ వారి సన్నిధిలో నిస్వార్థంగా ఉచిత సేవ చేసే సేవకులు, భక్త బృందాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి భక్తుల సేవలో వినియోగిస్తామని ఈవో పేర్కొన్నారు. భక్తులకు త్రాగు నీరు అందించడం, అన్న ప్రసాద వితరణ,ఉచిత ప్రసాద వితరణ, దర్శనం క్యూ లైన్ల నిర్వహణ, క్లోక్ రూమ్, చెప్పుల స్టాండ్, మొబైల్ భద్రపరచే ప్రదేశం, భక్తుల ఫీడ్ బ్యాక్ కౌంటర్, లిప్ట్ క్యూ వద్ద,దేవస్థానం బస్ క్యూ వద్ద, పార్కింగ్, టోల్ గేట్ వద్ద వాహనాలు క్రమబద్దీకరణ తదితర చోట్ల సేవకుల, భక్త బృందాల సేవలు వినియోగించనున్నట్లు ఈవో తెలిపారు.

ఇలా అమ్మవారి సేవ చేయడానికి ముందుకొచ్చే సేవకులు మొదటగా దేవస్థానం వెబ్ సైట్ www.kanakadurgamma.org లో volunteer విభాగం లో join as volunteerగా తమ పేరు,ఫోన్ నెంబర్, పూర్తి చిరునామా, ఫోటో, ఆధార్ తో రిజిస్ట్రేషన్ చేయాలని ఈవో తెలిపారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న సేవకులకు సేవ ఎప్పుడు కేటాయించాము, ఎన్ని రోజులు, వసతి, అన్న ప్రసాదం, లాకర్ సౌకర్యం, సేవకులకు తాత్కాలిక గుర్తింపు కార్డు, వసతి నుండి దేవస్థానానికి రవాణా సదుపాయాల వివరాలు మెసేజ్ రూపంలో అందేలా పారదర్శకంగా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తి భావంతో అర్హత గలిగిన వ్యక్తులను సేవకు వినియోగిస్తామని ఈవో శీనా నాయక్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+