విజయవాడ షాపింగ్ మాల్స్ లో పార్కింగ్ ఫీజు ఇలా- కమిషనర్ ఆదేశాలు..!
విజయవాడలోని షాపింగ్ మాల్స్ లో పార్కింగ్ ఫీజుల దోపిడీకి చెక్ పెట్టేలా మున్సిపల్ కమిషనర్ థ్యాన్ చంద్ర కీలక ఆదేశాలు ఇచ్చారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఉత్తర్వుల మేరకు షాపింగ్ మాల్స్ లో షాపింగ్ చేసిన, సినిమా చూసిన వాహనదారులు చెల్లించాల్సిన పార్కింగ్ ఫీజులపై ఇవాళ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో నగరంలో షాపింగ్ మాల్స్ ఈ ఉత్తర్వుల్ని కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం షాపింగ్ మాల్స్ లో షాపింగ్ చేసిన, సినిమా చూసిన వాహనదారుల నుంచి మొదటి అరగంట వరకు ఎటువంటి పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. అరగంటకు మించి గంటలోపు పార్కింగ్ చేసిన వ్యక్తి, తాను మాల్లో షాపింగ్ చేసినట్టు రుజువును బిల్లు రూపంలో సమర్పిస్తే ఎటువంటి పార్కింగ్ చెల్లింపులు చెల్లించిన అవసరం లేదని వెల్లడించారు.

అలాగే గంటకు పైబడి పార్కింగ్ చేసినచో షాపింగ్ చేసినా, సినిమా చూసినా, ఆ టికెట్/బిల్ ను రుజువుగా చూపిస్తే వారు పార్కింగ్ ఫీజు ని చెల్లించిన అవసరం లేదని కమిషనర్ థ్యానచంద్ర తెలిపారు. బిల్ /టికెట్ చూపించకపోతే మాత్రం వారు పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిందేనని కమిషనర్ తెలిపారు. దీంతో నగరంలోని షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ లలో ఫీజుల దోపిడీకి చెక్ పడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా అవి నగరంలో అమలు కాకపోవడంతో కమిషనర్ ఇలా ప్రత్యేకంగా దీనిపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications