విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు - దారి మళ్లింపు..!!
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో చేపట్టనున్న ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లు పూర్తిగాను, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసి, కొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు విజయవాడ డివిజన్ అధికారులు ప్రకటించారు. రైల్వే ట్రాక్ మరమ్మతులు, పలు పనుల దృష్ట్యా పలు రైళ్లను పూర్తిగా.. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు. మరి కొన్ని రైళ్లను దారి మళ్లించింది. ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు ఈ మార్పులు అమల్లో ఉంటాయి.
రద్దయిన రైళ్లు: 17239/17240 గుంటూరు-విశాఖపట్నం,07977/07978విజయవాడ-బిట్రగుంట,17219/17220 మచిలీపట్నం-విశాఖపట్నం, 17243/17244 గుంటూరు-రాయగడ రైళ్లు ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు రద్దు చేసారు.

అదే విధంగా పాక్షికంగా విజయవాడ రామవరప్పాడు మధ్య ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు రద్దయిన రైళ్లల్లో 07896 మచిలీపట్నం-విజయవాడ, 07769 విజయవాడ-మచిలీపట్నం, 07863 విజయవాడ- నర్సాపూర్, 07866 విజయవాడ- మచిలీపట్నం, 07770 మచిలీపట్నం- విజయవాడ, 07283 విజయవాడ- భీమవరం జంక్షన్, 07870 మచిలీపట్నం- విజయవాడ, 07861 విజయవాడ-నర్సాపూర్ రైళ్లు ఉన్నాయి.
దారి మళ్లింపు (వయా విజయవాడ, భీమవరం, నిడదవోలు) రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు. 22643 యర్నాకుళం-పాట్నా (ఈ నెల 29, ఫిబ్రవరి 5, 12, 19 తేదీల్లో), 12756 భావనగర్-కాకినాడపోర్ట్ (ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో), 12509 బెంగళూరు-గౌహతి(ఈ నెల 31, ఫిబ్రవరి 2, 7, 9, 14, 16, 21, 23 తేదీల్లో), 11019 ఛత్రపతి శివాజీ టెర్మినస్-భువనశ్వర్ (ఈ నెల 29, 31 ఫిబ్రవరి 2, 3, 5, 7, 9, 10, 12, 14, 16, 17, 19, 21, 23, 24 తేదీల్లో),13351 ధన్బాద్-అల్లపూజ(ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 25వరకు), 18111 టాటా- యశ్వంత్పూర్(ఫిబ్రవరి 1, 8, 15, 22 తేదీల్లో), 22837 హతియా-బెంగళూరు(ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో), 12835 హతియా-బెంగళూరు(ఈ నెల 30, ఫిబ్రవరి 4, 6, 11, 13, 18, 20, 25 తేదీల్లో), 12889 టాటా-బెంగళూరు(ఫిబ్రవరి 2, 9, 16, 23 తేదీల్లో) దారి మళ్లింపు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications