విజయవాడ ప్రజలకు భారీ శుభవార్త.. 11 రోజులపాటు అంబరాన్ని తాకేలా..
సోసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సారధ్యంలో కూటమి ప్రభుత్వం సహకారంతో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు 'విజయవాడ ఉత్సవ్' పేరుతో కృష్ణా నది తీరంతో పాటుగా నగరంలోని మైదానాల్లో సంగీత, సినీ, సాంస్కృతిక వేడుకలు నిర్వహించనున్నారు. అలానే కృష్ణానదిలో పడవల పోటీలు, డ్రోన్ షో, ఎగ్జిబిషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు రెండు మూడు రోజులు ఇక్కడే ఉండే విధంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ విజయవాడ ఉత్సవ్ నిర్వహించనున్నారు. విజయవాడ అంటే దసరా, దసరా అంటే విజయవాడ అనేలా దసరా నవరాత్రి మహోత్సవాలు ఇక్కడ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేసే భక్తులు, పర్యాటకులు రెండు మూడు రోజులు ఇక్కడే ఉండే విధంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహించనున్నారు. ఈ ఏడాది నుంచి విజయవాడలో జరిగే దసరా మహోత్సవాలు మైసూర్ దసరా ఉత్సవాలను మించేలా ఉండాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. అలాగే విజయవాడలో దాదాపు పన్నెండు ఏళ్ల తర్వాత ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. ఈ ఎగ్జిబిషన్ ను కూడా విజయవాడ ఉత్సవ్ తో ప్రారంభించనున్నారు.
ఉమ్మడి కృష్ణ జిల్లా కూచిపూడి లాంటి శాస్త్రీయ నాట్యానికి పుట్టినిల్లు. కళలకు, కళాకారులకు, కవులకు కొదవ లేదు. సాంస్కృతిక, చారిత్రక వైభవానికి విజయవాడ ప్రసిద్ది. అలాంటి కళలు, కళాకారులతో విజయవాడ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే విజయవాడ నగరంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం,ఘంటసాల సంగీత కళాశాల, పున్నమి ఘాట్, గొల్లపూడిలో విజయవాడ ఎక్స్ -పో ఏర్పాటు చేస్తున్నారు. 11 రోజులు పాటు జరిగే విజయవాడ ఉత్సవ్ లో దాదాపు 300 కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.
తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాల లో శాస్త్రీయ నృత్యాలు, కూచిపూడి, భారతనాట్యం, భక్తి పాటలు, హరికథలు, బుర్ర కథలు, తోలు బొమ్మలాట, పద్య నాటకాలు, పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు ఉంటాయి. ఇక్కడ దాదాపు 11 రోజుల్లో 100 కల్చరల్ ప్రోగ్రామ్స్ జరగనున్నాయి. పున్నమి ఘాట్ లో డ్రోన్ షో, వాటర్ స్పోర్ట్స్, ఫుడ్ కోర్ట్స్, లేజర్ షో, దాండియా, మ్యూజిక్ కన్సర్ట్స్ ఉంటాయి. ఇక్కడ 11 రోజుల్లో 60 ఈవెంట్స్ జరుగుతాయి. అంతే కాదు పదకొండు రోజులు లైవ్ మ్యూజిక్ కన్సర్ట్స్ జరుగుతాయి. అలాగే విజయవాడ ఎక్స్ పో గొల్లపూడిలో అమ్యూజిమెంట్ పార్క్, గ్లోబల్ విలేజ్, ఫుడ్ కోర్ట్స్, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి.
విజయవాడ ఎక్స్ -పో గొల్లపూడిలో సెప్టెంబర్ 22వ తేదీ మణిశర్మ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్, సెప్టెంబర్ 23వ తేదీ ఆర్. పి పట్నాయక్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్, సెప్టెంబర్ 24వ తేదీ కార్తీక్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్, సెప్టెంబర్, 26వ తేదీ తైక్కుడమ్ బ్రిడ్జ్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్, సెప్టెంబర్ 28వ తేదీ సింగర్ సునీత్ లైవ్ కాన్సర్ట్, సెప్టెంబర్ 28వ తేదీ రామ్ మిర్యాల లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్, సెప్టెంబర్ 30వ తేదీ
అక్టోబర్ 1వ తేదీ గీతా మాధురి లైవ్ కాన్సర్ట్ అండ్ బ్యాండ్ రుద్ర లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ఉంటాయి.

అలాగే సెప్టెంబర్ 25వ తేదీ విజయవాడ ఎక్స్ -పో గొల్లపూడి లో క్రౌన్ ఆఫ్ విజయవాడ (మిస్ అండ్ మిస్టర్) సెప్టెంబర్ 27 ఎమ్.జి రోడ్డులో మెగా కార్నివాల్ వాక్, సెప్టెంబర్ 29వ తేదీ విజయవాడ ఎక్స్ -పో గొల్లపూడిలో విజయవాడ ఐడల్ కార్యక్రమం, సెప్టెంబర్ 30వ తేదీ పున్నమి ఘాట్ లో అగ్ని అవార్డ్స్ అక్టోబర్ 1వ తేదీ పున్నమి ఘాట్ లో సోషల్ మీడియా అవార్డ్స్, అక్టోబర్ 2వ తేదీ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద స్వచ్ఛాథాన్, ఇక సిద్దార్థ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్ లో హెలికాప్టర్ రైడ్ ఉండనుంది.












Click it and Unblock the Notifications