Viral Audio: మాజీమంత్రి అనిల్ కూ లోన్ యాప్ బెదిరింపులు-చెప్పుతో కొడతానని హెచ్చరిక..

నెల్లూరు జిల్లాలో లోన్ యాప్ ఆగడాలు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ కీలక నేతలకూ షాకులిస్తున్నాయి. తనకు ఎదురైన లోన్ యాప్ ఆగడాలపై మంత్రి కాకాణి పోలీసులకు ఫిర్యాదు చేసి పట్టించిన వైనం మర్చిపోకముందే వైసీపీకే చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను సైతం లోన్ యాప్ మాఫియా తీవ్రంగా బెదిరించింది. దీంతో ఆయన కూడా రెచ్చిపోయారు. ఈ ఆడియో సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతోంది.

నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ ను కూడా లోన్ యాప్ మాఫియా వదలడం లేదు. అనిల్ ఓ కార్యక్రమంలో బిజీగా ఉండగా లోన్ యాప్ టెలీకాలర్ నుంచి ఆయనకు కాల్ వచ్చింది. అనిల్ కి కాల్ చేసి అశోక్ అనే వ్యక్తి గురించి ఆరా తీసిన సదరు టెలీకాలర్.. ఆయన మీ బావమరిది అంటూ రెచ్చిపోయింది. ఆయన తీసుకున్న 8 లక్షలు ఎవ్వరు కడతాడంటూ అనిల్ ను బెదిరించింది. తాను మాజీ మంత్రిని అని చెప్తున్నా వినిపించుకోలేదు. చివరికి మరో టెలీకాలర్ ను రంగంలోకి దింపింది.

Viral Audio : former ysrcp minister anil kumar yadav also faced loan app torture,audio leak

ఓవైపు ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి అనిల్ మొత్తుకున్నా వదల్లేదు. మీరిద్దరూ కలిసి డబ్బులు వాడుకుని ఇప్పుడు కట్టనంటే ఎలా అంటూ టెలీకాలర్ రెచ్చిపోయింది. దీంతో మాజీ మంత్రి కూడా చెప్పుతీసుకుని కొడతా అంటూ హెచ్చరించారు. అయినా టెలీకాలర్ వెనక్కి తగ్గలేదు. తనకు అసలు బావమరిదే లేడని, తన పేరు వాడుకున్న వాడిని జైల్లో వేయించాలని కూడా అనిల్ చెప్పారు. చివరికి బ్యాంకుకు వచ్చి మాట్లాడుతాం అని చెప్పినా వినకుండా సదరు మహిళా టెలీకారల్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది.

ఇలాంటి కాల్స్ మంత్రి కాకాణికి కూడా రావడంతో ఇద్దరు వేర్వేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. చెన్నైకి చెందిన కోల్ మాన్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన నలుగురు వ్యక్తులను ఈ వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇప్పుడు అనిల్ యాదవ్.. టెలీకాలర్ తో మాట్లాడిన ఆడియో వైరల్ గా మారడంతో జనం దీని గురించే చర్చించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+