విశాఖలో భారీగా పట్టుపడ్డ డ్రగ్స్.. తెర మీదకు టీడీపీ నేత..?
ఏపీలో భారీ ఎత్తున మత్తు పదార్థాలు స్వాధీనం కావడం సంచలనంగా మారింది. విశాఖ పోర్టులో 25 వేల కేజీల డ్రగ్స్ పట్టుబడింది. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్‌లో భారీ ఎత్తున కొకైన్ దొరకడం కలకలం రేపుతోంది. డ్రైఈస్ట్‌తో మిక్స్ చేసిన బ్యాగుల్లో డ్రగ్స్‌ను తరలిస్తుండగా అధికారులు ఈ కంటైనర్ స్వాధీనం చేసుకున్నారు.
ఇంటర్‌పోల్ ఇచ్చిన విశ్వసనీయ సమాచారంతో సీబీఐ అధికారులు విశాఖపట్నం పోర్ట్‌లో ఈ మత్తు పదార్థాలను పట్టుకున్నారు. కొకైన్‌ను ఈస్ట్ సంచులలో కలిపినట్లు కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ గుర్తించింది. మొత్తం సరుకులో ఎంత శాతం మత్తు పదార్థాలు ఉన్నాయనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా కంటైనర్ ఈ నెల 16న విశాఖపట్నం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. బ్రెజిల్ నుంచి విశాఖపట్నంలోని సంధ్యా ఎక్స్‌పోర్ట్స్‌కు కంటైనర్ వచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే సంధ్యా ఎక్స్‌పోర్ట్స్‌కు సంబంధించిన యాజమాన్యంపై సీబీఐ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.తాజాగా ఈ కేసులో ఓ టీడీపీ నేత ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
AS PART OF OPERATION GARUDA CBI DETAINS A SHIPPING CONTAINER SUSPECTED TO HAVE NARCOTICS DRUGS MIXED WITH AROUND 25000 KG INACTIVE DRIED YEAST; ENTIRE CONSIGNMENT SEIZED AND CASE REGISTERED pic.twitter.com/VLyV6bGopC
— Central Bureau of Investigation (India) (@CBIHeadquarters) March 21, 2024
డ్రగ్స్‌కు సంబంధించిన కేసులో టీడీపీకి చెందిన ఓ నేత ఉన్నారని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. విశాఖలోని ఓ ప్రైవేట్ కంపెనీకు ఈ ఆర్డర్ వచ్చిందని.. ఆ కంపెనీ టీడీపీకి చెందిన ఓ నేతదని అంటున్నారు. అయితే ఆ టీడీపీ నేత పేరు మాత్రం బయటకు వెల్లడించడం లేదు. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు డ్రగ్స్ మాఫియా వెనుక ఎవరెవరు ఉన్నారో తెలుసుకునే పనిలో పడ్డారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications