సరుకు లోడింగ్ లో విశాఖ పోర్టు సరికొత్త రికార్డు.. ఒక్కరోజులోనే!!
భారత దేశంలోని 13 ప్రధాన ఓడరేవుల్లో ఒకటైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక అతి పెద్ద ఓడరేవు విశాఖపట్నం ఓడరేవు. విశాఖపట్నం ఓడరేవుకు తనదైన ప్రాధాన్యత ఉంది. ఇది భారతదేశం యొక్క మూడవ అతి పెద్ద ప్రభుత్వ యాజమాన్య నౌకాశ్రయం. పరిణామంలో మరియు తూర్పు తీరంలో అతి పెద్ద ఓడరేవు గా ప్రసిద్ధి చెందింది.
ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ఓడరేవు సరుకు రవాణాలో అనేక రికార్డులను సృష్టిస్తూ తన రికార్డులను తిరగరాస్తూ తన ఖ్యాతిని చాటుకుంటుంది. ఇక తాజాగా విశాఖపట్నం ఓడరేవు లోడింగ్ లో కూడా చరిత్రను సృష్టించింది. సరకును లోడ్ చేయడంలో కూడా తన సత్తా చాటి విశాఖపట్నం ఓడరేవు రికార్డు నెలకొల్పింది.

నూతన సాంకేతికత సహాయంతో రెండు నెలల క్రితం నెలకొల్పిన రికార్డును తిరగరాస్తూ ఒక్కరోజులోనే 50 వేల 450 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని లోడ్ చేసి తన సత్తా చాటింది. ఎంవీ జి సి ఎల్ నర్మదా కార్గో నౌకలో ఆదివారం ఒక్క రోజే 50 వేల 450 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని లోడ్ చేశారు.
ఈ అతిపెద్ద లోడింగ్ ప్రక్రియ ద్వారా పోర్టు అధికారులు, సిబ్బంది తమ సత్తా చాటారు. ఈ సంవత్సరం మార్చి 26వ తేదీన అత్యధికంగా 44, 374 మెట్రిక్ టన్నుల లోడింగ్ రికార్డును నమోదు చేయగా, ప్రస్తుతం ఆ రికార్డులను అధిగమించి 50వేల మెట్రిక్ టన్నులకు పైగా ఇనుప ఖనిజాన్ని లోడ్ చేశారు. ఇక ఈ విషయాన్ని పోర్టు అధికారులు తాజాగా వెల్లడించారు.

ఇదిలా ఉంటే గతంలో తన రికార్డును తానే తిరగరాసిన విశాఖ పోర్టు 2022- 23 సంవత్సరంలో 73.73 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. విశాఖ పోర్టు తూర్పు తీరంలో సరుకు రవాణాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications