Illegal Affair:భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మిస్ వైజాగ్..ఉతికారేసింది..!
విశాఖపట్నంలో మరో అక్రమసంబంధం బట్టబయలైంది. భర్త తేజను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర.మీడియాను తీసుకెళ్లి అడ్డంగా పట్టుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ కేసు వివరాల్లోకి వెళితే...
మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర 2013లో ఓ సినిమా చేస్తున్న సందర్భంగా తేజాతో పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయం ప్రేమగా మారింది. దీంతో 2017లో వీరిద్దరూ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. వీరిద్దరికీ ఒక కుమార్తె కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు సాఫీగానే సాగిన వీరి సంసారంలో తేజ ఒక్కసారిగా ట్రాక్ తప్పాడు. అసలే సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఇతగాడు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం మొదలు పెట్టాడు. తనకు పరిచయమైన అమ్మాయిలు తనను పిలుస్తున్నారంటూ ఏకంగా భార్య నక్షత్రతోనే చెప్పేవాడు. ఈ విషయాన్ని స్వయంగా నక్షత్రనే మీడియా ముందు వెల్లడించింది. అయితే అప్పటికీ ఎంతో సహనంతో ఉన్న నక్షత్ర... తేజా రోజురోజుకూ హద్దులు దాటుతుండటంతో అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ తేజాలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో అతని నుంచి వేరుగా ఉంటోంది.

తేజా కూడా ఇవేమీ పట్టించుకోకుండా తన అక్రమ సంబంధాలు కొనసాగించాడు. ఇక తేజను ఎలాగైనా సరే దారికి తెచ్చుకోవాలని భావించిన నక్షత్ర.. మీడియాను వెంటబెట్టుకుని తేజా ఆఫీసుకు వెళ్లింది. కాలింగ్ బెల్ కొట్టగా తేజ తలుపులు తీశాడు. నక్షత్రను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు తేజ. ఆఫీసులో మరో అమ్మాయి ఉండటం చూసిన నక్షత్ర ఆమెపై ఆగ్రహంతో దాడి చేసింది. అయితే ఇది ఆఫీసు అయినప్పుడు తేజ మరో అమ్మాయితో పడక గదిలో ఎందుకున్నారంటూ ప్రశ్నించింది.నక్షత్ర పై దాడి చేశాడు తేజ.
ఇదిలా ఉంటే తేజ మాత్రం మరో వెర్షన్ వినిపించాడు. నక్షత్రనే తనపై తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించిందని చెప్పాడు. ఆఫీసులో మరో సినిమా విషయమై ఒక అమ్మాయితో చర్చలు జరుపుతున్న సమయంలో నక్షత్ర వచ్చి దాడి చేసిందని ఆరోపించాడు. అది ఇళ్లు కాదని, ఆఫీసు అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ అక్రమ వ్యవహారం విషయం మీడియాలో పెద్ద ఎత్తున టెలికాస్ట్ కావడంతో వైజాగ్‌లో చర్చనీయాంశంగా మారింది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications