అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీకి రూ.280 కోట్ల సాయం: విశాఖకు 2 అవార్డులు, టాప్ 30లో హైదరాబాద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/విశాఖ: కరవు సహాయనిధి కింద ఏపీకి రూ.280 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసింది. రాజ్‌నాథ్ సింగ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉన్నతస్థాయి కమిటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కరవు బృందాలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రకృతి వైపరీత్యాల సహాయనిధి నుంచి ఈ నిధులను మంజూరు చేశారు.

ఏపీకి రూ.280 కోట్లు. తమిళనాడుకు రూ.1,773 కోట్లు, అసోంకు రూ.332 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ.170 కోట్లు, జార్ఖండ్‌కు రూ.336 కోట్లు, రాజస్థాన్‌కు రూ.1,177 కోట్లు మంజూరు చేశారు.

విశాఖకు రెండు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు

స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను విశాఖ నగరం సొంతం చేసుకుంది. విశాఖకు రెండు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు వచ్చాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... నగరాల మధ్య పోటీ పెంచేందుకే ఈ అవార్డులు అన్నారు. 2019 నాటికి సంపూర్ణ స్వచ్ఛ భారత్ ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమన్నారు.

తొలి విడత స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 73 నగరాలు, పట్టణాలు పరిగణనలోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. పలు అంశాలను దృష్టిలో ఉంచుకుని నగరాలకు ర్యాంకింగ్‌ ఇచ్చినట్లు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో టాప్ టెన్ నగరాలు ఇవే... మైసూరు, ఛండీగఢ్, తిరుచిరాపల్లి, న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌, విశాఖ, సూరత్, రాజ్‌కోట్, గ్యాంగ్‌టక్, పింప్రి చించ్వాడ్, గ్రేటర్‌ ముంబై.

అట్టడుగు స్థాయి నగరాలు... కల్యాణ్, దొంబివిల్లి, వారణాసి, జంషెడ్‌పూర్, ఘజియాబాద్, రాయ్‌పూర్, మీరట్, పట్నా, ఇటానగర్, అసన్షోల్, ధన్‌బాద్. ఈ ఏడాది సర్వేలో 32 నగరాల ర్యాంకులు మెరుగుపడినట్లు వెంకయ్య తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌ నగరాలు టాప్‌ 30లో చోటు సంపాదించినట్లు వెల్లడించారు.

 Vishaka gets two Swachh Sarvekshan awards

సచివాలయ నిర్మాణానికి టెండర్లు ఖరారు

ఏఫీ తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయి. కాంట్రాక్టర్లకు చదరపు అడుగుకి రూ.3350 చొప్పున ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఎల్ అండ్ టీ రెండు ప్యాకేజీలు, షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ ఒక ప్యాకేజీ పనులు దక్కించుకున్నాయి.

జూన్‌ 15 నాటికి నిర్మాణం పూర్తి చేస్తామని ఈ సంస్థలు ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి. సోమ, మంగళవారాల్లో ఆ సంస్థలతో సీఆర్డీఏ ఒప్పందం కుదుర్చుకునే అవకాశముంది. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ వెంటనే యుద్ధప్రాతిపదికన నిర్మాణ పనులు మొదలవుతాయి.

తుళ్లూరు మండలంలోని వెలగపూడి గ్రామం పరిధిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి జనవరి 14న సీఆర్డీఏ టెండరు ప్రకటన జారీ చేసింది. మొత్తం ఆరు భవనాలను జీ+1 విధానంలో నిర్మించాలన్నది ఆలోచన. ఒక్కో భవనంలో లక్ష అడుగులు చొప్పున ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మితప్రాంతం ఉంటుంది.

ఆరు భవనాలను మూడు ప్యాకేజీలుగా విభజించి సీఆర్డీఏ విడివిడిగా టెండర్లు పిలిచింది. ఫిబ్రవరి 3న టెండర్లు తెరిచింది. ఫిబ్రవరి 6న ఫైనాన్షియల్‌ బిడ్లు తెరిచారు. సీఆర్డీఏ చదరపు అడుగుకి రూ.3000ధర నిర్ణయించగా.. ఈ రెండు కంపెనీలు చ.అ.కు రూ.830 అదనంగా బిడ్‌లు దాఖలు చేశాయి.

రూ.3150 చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. కంపెనీలు ససేమిరా అనడంతో మంత్రి నారాయణ, అధికారులు ఆ సంస్థల ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చివరకు రూ.3350కి పనులు చేపట్టేందుకు అంగీకరించాయి. తాత్కాలిక సచివాలయాన్ని 45.129 ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించారు.

27.082 ఎకరాల్లో భవనాలు నిర్మిస్తారు. 18.047 ఎకరాల్ని పార్కింగ్‌ వంటి ఇతర వసతులకు వినియోగిస్తారు. తాత్కాలిక సచివాలయ భవనాల్ని జీ+7 విధానంలో, మొత్తం 24 లక్షల చ.అ. నిర్మితప్రాంతం ఉండేలా డిజైన్‌ చేశారు. తొలి దశలో జీ+1 నిర్మాణమే చేపడతారు.

English summary
Vishakapatnam gets two Swachh Sarvekshan awards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X