కిడ్నాప్ కథ సుఖాంతం : క్షేమంగా విడుదలైన వైజాగ్ ఇంజనీర్

Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం : నైజీరియాలో విశాఖ ఇంజనీర్ కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైంది. 17 రోజుల క్రితం కిడ్నాప్ అయిన ఇంజనీర్ సాయి శ్రీనివాస్ కోసం అతడి కుటుంబ సభ్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోగా.. తాజాగా కిడ్నాపర్ల చెర నుంచి సాయి శ్రీనివాస్ క్షేమంగా బయటపడినట్టు సమాచారం.

17 రోజుల నిర్బంధం తర్వాత సాయి శ్రీనివాస్ ను అక్కడి కిడ్నాపర్లు వదిలిపెట్టారు. దీంతో కిడ్నాపర్ల నుంచి బయటపడిన వెంటనే కుటుంబ సభ్యులకు తన క్షేమ సమాచారాన్ని చేరవేశాడు సాయి శ్రీనివాస్. సాయి శ్రీనివాస్ ఫోన్ తో అతని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Vizag Engineer safely out from Nigerian kidnappers

ఇదిలా ఉంటే, నైజీరియాలో పనిచేస్తోన్న సాయి శ్రీనివాస్ ను అక్కడి నైజీరియన్లు గత నెలాఖరున కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. సాయి శ్రీనివాస్ కిడ్నాప్ తో తీవ్ర ఆందోళనకు గురైన అతని కుటుంబ సభ్యులు విషయాన్ని ఏపీ సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో కిడ్నాప్ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లగా.. విదేశాంగ శాఖ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇంతలో కిడ్నాపర్లే సాయి శ్రీనివాస్ ను వదిలేయడంతో కుటుంబ సభ్యుల ఆందోళనకు తెరపడింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
44-year-old civil Engineer Sai Srinivas safely out from nigerian kidnappers. In last month he was kidnapped from Gboko. a town in benue state of north central nigeria

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి