పాపం వంగా గీత.. పవన్ కళ్యాణ్ గాజుగ్లాసుకు ఓటేయమని ఓటర్ల ర్యాగింగ్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేళ జరిగిన దాడులు, ప్రతి దాడులు అటుంచి, రాష్ట్రంలో హాట్ టాపిక్ గా, హాట్ సీట్ గా నిలిచిన పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి టిడిపి, జనసేన, బిజెపి కూటమి తరపున పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగడంతో, ఆయనకు ప్రత్యర్థిగా వైసిపి వంగా గీతను రంగంలోకి దించింది.
పిఠాపురంలో హోరాహోరీ పోరు
పిఠాపురం నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో ఇరువురు హోరాహోరీగా పోరాటం చేశారు. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. పవన్ కళ్యాణ్ కోసం సినీ ప్రముఖులు రంగంలోకి దిగి పిఠాపురంలో మకాం వేసి మరీ ఎన్నికల ప్రచారం చేశారు. మెగా ఫ్యామిలీ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని అభిమానులకు విజ్ఞప్తి చేసింది.

కంటతడి పెట్టుకుని ఓట్లు అర్ధించిన వంగా గీత
ఇక వంగా గీత కోసం రంగంలోకి దిగిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో ఆఖరి సమావేశాన్ని పిఠాపురంలోనే ముగించారు. వైయస్ జగన్ తో కలిసి ఎన్నికల ప్రచారం చేసిన వంగా గీత ఉద్వేగానికి లోనై, కొంగు చాచి అడుగుతున్నా, గెలిపించండి అంటూ కంటతడి పెట్టుకున్నారు. ఇక జగన్ కూడా వంగా గీతను గెలిపిస్తే ఆమెకు డిప్యూటీ సీఎం పదవిని ఇస్తానని పిఠాపురం వేదికగా ప్రకటించారు
పాపం... వంగా గీత
సర్వశక్తులు ఒడ్డి పవన్ కళ్యాణ్ పై పోరాటం చేసిన వంగా గీతను ఈరోజు పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు గుర్తుపట్ట లేదట. ఏకంగా వంగా గీత కే గాజు గ్లాస్ కు ఓటు వేయమని కొందరు ఓటర్లు చెప్పారట. ఇక ఈ విషయాన్ని వైసిపి అభ్యర్థి వంగా గీత తన నోటితోనే చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాపం వంగా గీత అంటూ ఆమెపై సానుభూతి వ్యక్తం అవుతుంది.
పాపం వంగా గీత
— M9 NEWS (@M9News_) May 13, 2024
ఓటు వెయ్యడానికి లైన్ లో నిలబడితే గ్లాసు గుర్తుకు వెయ్యమని ఆమెకే చెబుతున్నారట
తనను ఎవరూ గుర్తుపట్టడం లేదని వాపోతున్న పిఠాపురం వైసీపీ అభ్యర్థి#PawanKalyan pic.twitter.com/L8JhbGtdVf
తనను ఓటర్లు గుర్తు పట్టటం లేదన్న గీత
ఓటు వేయడానికి లైన్లో నిలబడితే గ్లాస్ గుర్తుకు ఓటు వేయమని చెబుతున్న ఓటర్లు తనను గుర్తుపట్టడం లేదని వంగ గీత స్వయంగా లబోదిబోమన్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తుంది. నేడు పోలింగ్ సందర్భంగా తన ఓటు వేసుకోవడానికి వెళ్ళిన వంగా గీత క్యూలైన్లో నిలుచున్న క్రమంలో పవన్ కళ్యాణ్ కు ఓటు వేయమని చెప్పారు ఓటర్లు.
వంగా గీతకు మాస్ ర్యాగింగ్
అభ్యర్థికి ప్రత్యర్ధికి ఓటేయమని చెప్పడం కంటే ఇంతకంటే మాస్ ర్యాగింగ్ ఏదైనా ఉంటుందా అన్నది ఇప్పుడు పిఠాపురంలో చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలైన ఈసారి పిఠాపురంలో పక్కా గెలుస్తాడని, భారీ మెజారిటీ వస్తుందని పవన్ అభిమానులు భావిస్తున్న వేళ వంగా గీతకు చేదు అనుభవం ఎదురు కావడం అభిమానుల ఆశలకు రెక్కలు వచ్చేలా చేసింది.












Click it and Unblock the Notifications