వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైద్యం అందక బాలిక మృతి, పోస్టుమార్టం కోసం 14 కిలోమీటర్ల నడక

By Narsimha
|
Google Oneindia TeluguNews

పాడేరు :గిరిజన ప్రాంతాల్లో నివసించే వారికి కనీస సౌకర్యాలు కూడ ఉండవు. ఈ ప్రాంతాలను వదిలి రావడానికి గిరిజనులు మాత్రం ఇష్టపడరు. ఈ ప్రాంతాల్లో నివసించేవారికి ఆరోగ్య సమస్యలు వస్తే వైద్యం కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతాలకు వెళ్ళేందుకు టూ వీలర్లే శరణ్యం. చనిపోయిన ఓ బాలికకు శవపరీక్ష కోసం 14 కిలోమీటర్ల దూరం నడిచిన ఘటన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలిక ప్రాణాలను కాపాడేందుకు చివరివరకు ప్రయత్నించి విఫలమైన గిరిజనులు, పోస్టుమార్టం కోసం చివరకు 14 కిలోమీటర్ల దూరం నడిచిన విషాదఘటన పాడేరులో చోటుచేసుకొంది.ఈ ఘటన చూసిన వారు దు:ఖాన్ని ఆపులేకోపోయారు.

విశాఖ జిల్లా పాడేరు మండలంలోని వంజంగి పంచాయితీ పోతురాజుమెట్టలో కోరీర్ సంద్య అనే ఐదేళ్ళ బాలిక శుక్రవారం సాయంత్రం పూలుకోసేందుకు వెళ్ళింది. పూలు కోస్తు ప్రమాదవశాత్తు చెరువులో పడింది.స్థానికులు వెంటనే ఆమెను చెరువు నుండి బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.

walk 14 kms for postmortem

చిన్నారిని కాపాడుకొనేంుదకు 108 సమాచారం ఇచ్చారు.గిరిజన ప్రాంతం కావడంతో సరైన రహాదారి సౌకర్యం లేదు. అంబులెన్స్ సకాలంలో అక్కడికి చేరుకోలేదు.అంబులెన్స్ రాకముందే బాలిక మరణించిందిప్రమాదవశాత్తు మరణించడంతో బాలిక మృతదేహానికి శవపరీక్ష చేయాల్సి వచ్చింది.

పోస్టు మార్టం కోసం 14 కిలోమీటర్ల నడక.

అంత్యక్రియల కోసం శవాలను తీసుకొని కిలోమీటర్ల దూరం నడిచిన ఉదంతాలను ఇటీవల వెలుగుచేశాయి. ఒడిశా రాష్ట్రంలోను ఒక ఘటన చోటుచేసుకొంది. దీని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడ ఓ బిక్షగాడు తన భార్య శవాన్ని తీసుకొని 60 కిలోమీటర్లు నడిచుకొంటూ వెళ్ళాడు. వికారాబాద్ లో స్థానికుల సహాయంతో ఆయన తన స్వగ్రామానికి అంబులెన్స్ లో శవాన్ని తరలించాడు.ఇదే తరహాలో పాడేరు ఘటన కూడ ఉంది.

అంత్యక్రియలకు ముందుగా శవపరీక్ష నిర్వహించాల్సి రావడం గిరిజన కుటుంబానికి శాపంగా మారింది.శవపరీక్ష కోసం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరు ఏరియా ఆసుపత్రికి బాలిక మేనమామ తమ గ్రామం నుండి బయలుదేరాడు. 14 కిలోమీటర్ల దూరం బాలిక మృతదేహాన్ని తీసుకొని వెళ్ళాడు.ఈ విషయం తెలసుకొన్న మరో బందువు పాడేరుకు సమీపంలో బైక్ తీసుకొని వచ్చాడు. అప్పటికే పాడేరుకు సమీపంలోకి చేరుకొన్నాడు బాలిక మృతదేహంతో మేనమామ.పోస్టుమార్టం నిర్వహించుకిని తిరిగి బైక్ పై మృతదేహాన్ని తీసుకెళ్ళారు.

English summary
walk 14 kms for postmortem , this incident happened paderu constituency.5years an old sandhya died on Friday. sandhya's relative take her dead body for postmortem. they walk 14kms for postmartem.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X