ఘాటు సమాధానాలు, రామ్ గోపాల్ వర్మ ఎఫెక్ట్: రోజాను లాగారు, జగన్‌కు హెచ్చరిక

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ పైన టిడిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే వంగలపూడి అనితలు వైసిపి అధినేత జగన్, రోజాలను కూడా లా

అమరావతి: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ పైన టిడిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే వంగలపూడి అనితలు వైసిపి అధినేత జగన్, రోజాలను కూడా లాగారు.

 ఘాటుగా స్పందిస్తున్న వర్మ

ఘాటుగా స్పందిస్తున్న వర్మ

టిడిపి నేతల విమర్శలకు రామ్ గోపాల్ వర్మ కూడా ఘాటుగానే కౌంటర్ ఇస్తున్నారు. సోమిరెడ్డి, అనితలు మాట్లాడితే ఆయన ఫేస్‌బుక్ వేదికగా ఆయన ధీటైన కౌంటర్లు ఇస్తున్నారు. వాళ్లు మీడియా ముందుకు వస్తే, వర్మ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు.

 రోజాను లాగిన సోమిరెడ్డి

రోజాను లాగిన సోమిరెడ్డి

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయమై సోమిరెడ్డి తీవ్రంగా స్పందించారు. అవసరమైతే లక్ష్మీపార్వతిని హీరోయిన్‌గా పెట్టుకోవాలని వ్యాఖ్యానించిన సోమిరెడ్డి.. ఈ అంశంలోకి రోజాను కూడా లాగారు. సైడ్ హీరోయిన్‌గా జబర్దస్త్ నుంచి కూడా ఎవరినైనా పెట్టుకోవచ్చునని పరోక్షంగా రోజాను ఉద్దేశించి మాట్లాడారు.

జగన్‌ను లాగిన అనిత

జగన్‌ను లాగిన అనిత

మరోవైపు, వంగలపూడి అనిత కూడా జగన్‌ను లాగారు. ఎందరికో ఆరాద్య దైవమైన ఎన్టీఆర్ పైన ఇష్టం వచ్చినట్లు సినిమా తీస్తే తెలుగు ప్రజలు ఊరుకోరని చెబుతూ.. జగన్ పైన కూడా సినిమా తీసేవాళ్లుంటారని అనిత హెచ్చరించారు.

 వర్మ ఎఫెక్ట్, జగన్‌కు హెచ్చరిక

వర్మ ఎఫెక్ట్, జగన్‌కు హెచ్చరిక

వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత వైసిపి నేత రాకెష్ రెడ్డి. దీంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఈ సినిమా ఉంటుందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పైన కూడా సినిమా తీసేవాళ్లు ఉన్నారని అనిత హెచ్చరించారు. జగన్ జీవిత చరిత్రను ప్రజలకు సినిమా రూపంలో చూపిస్తే ఆయన పాదయాత్ర కూడా చేయలేరని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+