2019లో జనసేనతో కలిసే పోటీ, పార్టీలతో చర్చలు: రామకృష్ణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఐ, సిపిఎం, జనసేనతో కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కె. రామకృష్ణ చెప్పారు. ఇప్పటికే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో చర్చించామని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ విషయమై సిపిఎంతో కలిసి చర్చించనున్నట్టు రామకృష్ణ ప్రకటించారు.

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బిజెపి ప్రభుత్వం ఏపీ ప్రజలను మోసం చేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై రామకృష్ణ చెప్పారు.

మా లోపాలు కూడ మేం ఆత్మపరిశీలన చేసుకొంటున్నామని రామకృష్ణ చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి శత్రువును ఓడించేందుకు వ్యూహలను రచిస్తున్నామని చెప్పారు.

పవన్ కళ్యాణ్ తో కలిసి పోటీ చేస్తాం

పవన్ కళ్యాణ్ తో కలిసి పోటీ చేస్తాం


ఏపీ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో సిపిఐ సిపిఎం జనసేనతో కలిసి ఫ్రంట్‌గా ఏర్పాటై పోటీ చేసే ఆలోచన చేస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ చెప్పారు.పవన్ కళ్యాణ్ తో కలిసి పోటీ చేస్తామన్నారు. మాతో పాటు ఇంకా కలిసొచ్చే శక్తులను కలుపుకుపోతామని చెప్పారు.

వైసీపీ కూటమిలో ఉంటుందా అనేది చెప్పలేం

వైసీపీ కూటమిలో ఉంటుందా అనేది చెప్పలేం

2019 ఎన్నికల్లో తాము ఏర్పాటు చేసే కూటమిలో వైసీపీ ఉంటుందా ఉండదా అనే విషయాన్ని ఇప్పటికే చెప్పలేమని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. సిపిఐ, సిపిఎంలు ఒక ఉమ్మడి ప్రణాళికను రూపొందించుకొంటున్నట్టు ఆ ప్రణాళికను మద్దతిచ్చేవారిని కలుపుకుపోతామని చెప్పారు.

2009లో టిడిపితో పొత్తును ఉండాలనుకొన్నా

2009లో టిడిపితో పొత్తును ఉండాలనుకొన్నా


2009 సమయంలో టిడిపితో పొత్తును కోరుకొన్నానని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. 2009లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు బలంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓడించేందుకుగాను 2009తో పొత్తును తాను కోరుకొన్నట్టు సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణ గుర్తు చేశారు. సిద్దాంతపరమైన విబేధాలతోనే తాను విమర్శలు చేస్తానని రామకృష్ణ చెప్పారు.

బిజెపి ఏపీ ప్రజలను మోసం చేసింది

బిజెపి ఏపీ ప్రజలను మోసం చేసింది

ఏపీ ప్రజలను బిజెపి, టిడిపిలు మోసం చేశాయని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను నెరవేర్చలేదన్నారు. ప్రత్యేక హోదా , ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఏపీ ప్రజలను దగా చేశారని చెప్పారు.ఈ విషయాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని రామకృష్ణ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+