Rain alert: ఏపీలో రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక తీరానికి ఆనుకుని ఉన్న ఉపరితల ఆవర్తనం.. సోమవారంనాటికి నైరుతి బంగాళాఖాతం, ఉత్తర శ్రీలంక తీరంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపునకుక వంగి ఉంది.

ఏపీలో మూడు రోజులపాటు వర్షాలు, గాలులు
మరోవైపు, ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణలో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. ఇక బంగాళాఖాతంలోని నైరుతి ప్రాంతాలపై మరో తుఫాను సర్క్యులేషన్ ఏర్పడటంతో వచ్చే మూడు రోజులపాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమవారం నుంచి నవంబర్ 2 వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

నెల్లూరు జిల్లాలో భారీ వర్షం.. ఉత్తరకోస్తా, యానాంలలోనూ
బుధవారం నెల్లూరు జిల్లాలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీతోపాటు యానాంలోనూ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. బుధవారం చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

దక్షిణ కోస్తా, రాయలసీమలోనూ భారీ వర్షాలు
దక్షిణ కోస్తాంధ్రలో కూడా రానున్న మూడు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్లు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. మరోవైపు, రాయలసీమలోనూ రానున్న మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయి.
-
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా












Click it and Unblock the Notifications