AP Weather: ఏపీలో మరో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు, ఈ జిల్లాల్లో భారీ వానలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం నాటి అల్పపీడనం విదర్భ, పశ్చిమ ప్రాంతాలలో బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలోమీరట్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి వైపునకు కొనసాగుతోంది.

మంగళవారం తూర్పు-పడమర 'షీర్ జోన్'(ద్రోణి) 15°ఉత్తర అక్షాంశము వెంబడి సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తుల మధ్య స్థిరంగా కొనసాగుతున్నది. వీటి ప్రభావం వల్ల రాగల మూడు రోజుల వరకు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

 Weather update: three more days heavy rains in few districts in Andhra pradesh

మంగళవారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. బుధవారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

మంగళవారం దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. బుధవారం దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. గురువారం దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రాయలసీమలో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. గురువారం రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు. మరోవైపు తెలంగాణలోనూ మూడు నుంచి నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కురిసిన వర్షాలతో పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి వరదనీటిని దిగువ ప్రాంతాలకు పంపిస్తున్నారు.

Recommended Video

    Talibans ఆ విమానాలన్నీ తమకే అనుకున్నారు.. US Army పంచ్ | Afghanistan || Oneindia Telugu

    తెలంగాణలో మరో మూడు నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంగా హైదరాబాద్ నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారమే సీఎస్ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, అధికారులను అప్రమత్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణతో పాటు మెదక్, ఖమ్మం, మహబూబ్ నగర్, ఖమ్మం తదితర జిల్లాల్లో వర్షాల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఆది, సోమవారాల్లో కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జలదిగ్భందంలో చిక్కుకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+