కాకినాడ మత్స్యకారుల వలలో చిక్కిన పులి బొక్కిసొర

Subscribe to Oneindia Telugu

కాకినాడ: కాకినాడలో మత్స్య కారుల వలకు భారీ చేప చిక్కింది. బంగాళ ఖాతంలో వేటకు వెళ్ళిన మత్స్యకారుల వలలో టన్నున్నర బరువుగల వేల్ షార్క్ పడింది.

ఐతే అది చనిపోవడంతో మత్స్యకారులు దానిని ఫిషింగ్ హర్బర్‌కు తరలించారు. క్రేన్ సాయంతో దానిని బోటు నుండి జట్టీలోకి దించారు. దీంతో అక్కడ ఉన్న మత్స్యకారులు, వ్యాపారులు ఈ సొరను ఆసక్తిగా తిలకించి.

Whale shark found in Kakinada

ఆ చిత్రాలను తమ సెల్ ఫోన్‌లో బంధించారు. వేల్ షార్ల్‌ను తెలుగులో పులి బొక్కి సొర అంటారు. ఇది పూర్తిగా శాఖాహారి. సముద్రంలో మొక్కలు తిని జీవిస్తుంది. అయితే ఈ జాతి అంతరించిపోతుండటంతో ప్రభుత్వం ఈ షార్క్‌లపై వేటను నిషేధించింది.

ఒకవేళ పొరపాటున గంగపుత్రుల వలకు ఈ చేప చిక్కితే వల కట్ చేసి దానిని సముద్రంలో వదిలేయాలి.అలా చేసి ఆ విడియోను అధికారుకు చూపిస్తే ప్రభుత్వం వారికి రూ.25 వేల నగదు ఇస్తుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Whale shark found in Kakinada on Friday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X