BRS: పవన్ కల్యాణ్ కు ముందే తెలుసా? లేదంటే వ్యూహాత్మకమా?

APలో BRS పార్టీకి అధ్యక్షులుగా నియమితులైన తోట చంద్రశేఖర్ జనసేన పార్టీలో పవన్ కల్యాణ్ కు కుడిభుజం లాంటి వ్యక్తి. చిరంజీవితోకానీ, పవన్ తోకానీ అత్యంత నమ్మకస్తునిగా వ్యవహరిస్తారు. అటువంటి వ్యక్తి పవన్ కల్యాణ్ కు తెలియకుండానే బీఆర్ఎస్ లో చేరారా? లేదంటే ముందే జనసేనానికి చెప్పి చేరారా? అనే ప్రశ్న ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమైంది.

పవన్ ఊహించలేదా? ముందే తెలుసా?

పవన్ ఊహించలేదా? ముందే తెలుసా?

పవన్ కల్యాణ్ తెలంగాణలో బీజేపీతో పొత్తులో ఉన్న సమయంలోనే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీచేస్తున్న పీవీ నరసింహారావు కుమార్తెకు మద్దతు ప్రకటించారు. అంతేకాదు.. కేసీఆర్ పాలనను తరుచుగా పొగుడుతుంటారు. పవన్ సినిమా వేడుకలకు కేటీఆర్ హాజరవుతుంటారు. ఇరువైపులా అంతటి సఖ్యత ఉంది. అలాంటి పార్టీలోకి నమ్మకస్తుడైన చంద్రశేఖర్ వెళతారని పవన్ ఊహించలేదా? లేదంటే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్న గేమా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

తెలంగాణలో త్యాగాలు

తెలంగాణలో త్యాగాలు

బీజేపీ ఒంటరిగా పోటీచేయడం కోసం పొత్తున్నప్పటికీ కొన్ని త్యాగాలు జనసేన చేసింది. తీరా చివరకు వచ్చేసరికి తాము ఒంటరిగా పోటీచేస్తామని, జనసేనాని అవసరం లేదని తేల్చిచెప్పేసింది. తర్వాత నెలకొన్న కొన్ని పరిణామాలు కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అవమానకరంగా తోచాయి. దీంతో ఏపీలో కూడా బీజేపీతో అంటీముట్టనట్లుగా ఉంటారు. జనసేనతో పొత్తు లేదని తెలంగాణ బీజేపీ శాఖ స్పష్టంగా ప్రకటించింది. తెలంగాణలో బలోపేతమవుతున్నామనే ఉద్దేశంతో ఉన్న బీజేపీ జనసేనను తేలికగా తీసుకుంది.

పవన్ తమతోనే ఉన్నారంటున్న బీజేపీ?

పవన్ తమతోనే ఉన్నారంటున్న బీజేపీ?


ఏపీలో పవన్ తమతోనే ఉన్నారని బీజేపీ నేతలు సోము వీర్రాజుతోపాటు పలువురు నేతలు తరుచుగా ప్రకటిస్తున్నారు. చంద్రబాబుతో మీడియా సమావేశం జరిగిన తర్వాత ఈ ప్రకటనలు మరింత పెరిగాయి. కానీ పవన్ మాత్రం అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ప్రధానమంత్రి ఇచ్చిన రోడ్ మ్యాప్ కూడా నచ్చలేదని, తెలుగుదేశం పార్టీతో పొత్తుకు వెళ్లడం ఖాయమని వార్తలు వచ్చాయి. తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదిరితే విజయం ఖాయమనే ధీమాలో ఇరుపార్టీల శ్రేణులు ఉన్నాయి.

పవన్ తదుపరి అడుగు ఏమిటి?

పవన్ తదుపరి అడుగు ఏమిటి?

ఇప్పుడు తోట బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత సాధ్యమైనంత మేర కాపు ఓట్లకు గండి పడుతుంది. అది టీడీపీ, జనసేన విజయావకాశాలను ప్రభావితం చేస్తుంది. వ్యతిరేక ఓటును చీలిపోనివ్వనని, అందరం కలిసి పోటీచేసి వైసీపీని ఓడిస్తామని పవన్ పదే పదే ప్రకటిస్తున్నారు. కానీ తోట బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపడంవల్ల వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశం ఉందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పుడు జనసేనాని ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా? తదుపరి ఎటువంటి అడుగు వేయబోతున్నారు? అనేది ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+