టీడీపీ కౌంటర్ అటాక్: ఆ స్థలం వాళ్లదా?

Chandrababu Naidu: రాజధాని అమరావతి పరిధిలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసింది. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం ఇది. రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇది నిర్మితమౌతోంది. దీన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు.

ఈ తెల్లవారుజామున సుమారు 5:30 గంటల సమయంలో కూల్చివేత పనులు మొదలయ్యాయి. మూడు గంటల వ్యవధిలో పూర్తయ్యాయి. బుల్‌డోజర్లు, ప్రొక్లెయినర్లతో ఈ భవనం నిర్మాణాన్ని కూల్చివేశారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యగా పోలీసులను సంఘటన స్థలం వద్ద మోహరింపజేశారు.

What TDP says on an under construction YSRCP s office demolition in Tadepalli

ఇది అక్రమ నిర్మాణం అంటూ ఇటీవలే సీఆర్డీఏ అధికారులు వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వానికి నోటీసులు జారీ చేశారు కూడా. కూల్చివేయాంటూ ఆదేశించారు. ఈ నోటీసులపై శుక్రవారం వైఎస్ఆర్సీపీ నాయకులు హైకోర్టను ఆశ్రయించారు. పిటీషన్లను దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. వారికి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది.

సీఆర్డీఏ పరిధిలో ఎలాంటి కూల్చివేత పనులు చేపట్టకూడదంటూ హైకోర్డు ఉత్తర్వులు జారీ చేసినట్లు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి చెబుతున్నారు. సీఆర్డీఏ కమిషనర్‌కు కూడా తమ న్యాయవాది ద్వారా ఈ విషయాన్ని తెలియజేశామని, అయినప్పటికీ హుటాహుటిన బుల్‌డోజర్లు, ప్రొక్లెయినర్లతో కూల్చివేత పనులు చేపట్టారని పేర్కొన్నారు.

దీన్ని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయ కక్షసాధింపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం దిగిందని మండిపడ్డారు. తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని, ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్‌డోజర్లతో కూల్చివేయించారంటూ ధ్వజమెత్తారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారని చెప్పారు.

What TDP says on an under construction YSRCP s office demolition in Tadepalli

దీనిపై తెలుగుదేశం పార్టీ స్పందించింది. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మిస్తోన్న స్థలం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిందని తెలిపింది. బోట్ యార్డ్ కోసం ఈ స్థలాన్ని కేటాయించినట్లు వివరించింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఆ స్థలాన్ని ఆక్రమించిన వైఎస్ఆర్సీపీ..తన కేంద్ర కార్యాలయాన్ని నిర్మాణానికి పూనుకున్నట్లు స్పష్టం చేసింది.

సీఆర్డీఏ, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలకు అనుగుణంగానే కూల్చివేత చర్యలను చేపట్టినట్లు తేల్చి చెప్పింది టీడీపీ. ఇలాంటి అక్రమ నిర్మాణాలను ఎంత మాత్రం ఉపేక్షించబోమని, వాటన్నింటినీ కూల్చివేసేలా మున్ముందు మరిన్ని చర్యలు ఉండబోతోన్నాయని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+