పవన్ చేతికి ఆ రెండు ఉంగరాలు - అసలు రహస్యం ఇదేనా..!?
పవన్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సెంటిమెంట్ ను నమ్ముకుంటున్నారా. పవన్ చేతికి రెండు ఉంగరాలు మరోసారి పార్టీలో చర్చకు కారణమవుతున్నాయి. తాజాగా భీమవరం సభలో పవన్ ఎన్నికల్లో తన లక్ష్యాలను వివరించారు. ఆయన పొత్తుల కోసం తాను ఏ రకంగా కష్టపడిందీ వివరించారు. ఆ సమయంలోనే పవన్ చేతికి ఉన్న రెండు ఉంగరాలు పార్టీ కేడర్ ను ఆకర్షించాయి. సెంటిమెంట్స్ ను ఎక్కువగా నమ్ముకొనే పవన్ కు ఈ రెండు ఉంగరాలతో రాజకీయంగా దశ మారబోతోందా.
పవన్ చేతికి ఉన్న రెండు ఉంగరాలు ఇప్పుడు ప్రత్యేకార్షణగా మారాయి. పవన్ చేతికి ఉన్న ఉంగరాల్లో ఒకటి నాగబంధం కాగా, మరొకటి కూర్మావతారం. పవన్ జాతక రీత్యా ఈ రెండు ఉంగరాలతో ఆయనకు కలిసి వస్తుందనే అంచనాలు జ్యోతిష్కులు వెల్లడిస్తున్నారు. పుట్టిన తేదీ, పుట్టిన సమయం ప్రకారం పవన్‌ది మకర రాశి.

పైగా ఆయనకు రాహు-కేతు దోషాలు ఉన్నాయనే జ్యోతిష్కులు చెబుతున్నారు. దీంతో పాటుగా రాజకీయంగానూ కలిసి రావాలనే లక్ష్యంతోనే ఈ రెండు ఉంగరాలను పవన్ ధరించినట్లు చర్చ జరుగుతోంది. నాగుపాము ఆకారంలో ఉండే నాగబంధం ఉంగరం వల్ల అపమృత్యు దోషాలు ఏమైనా ఉంటే.. తొలగిపోతాయి.
తాబేలు ప్రతిమ ఉన్న ఉంగరం ధరిస్తే వృద్ది, అధికారం, ప్రజాకర్షన వంటి అంశాల విషయంలో కలిసి వస్తుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. నాగబంధం ఉంగరం ధరిస్తే అనుకోని విపత్తులు, గండాల నుంచి రక్షిస్తుంది. అలాగే ఎలాంటి దుష్ట శక్తులు మనపై పడకుండా ఈ ఉంగరం రక్షిస్తుందనే నమ్మకం ఉంది.
కూర్మావతారం ఉంగరం ద్వారా ధన యోగంతో పాటుగా అధికారం సిద్దిస్తుందనేది విశ్వాసంగా కనిపిస్తోంది. అధికారం కోరుకొనే వారు ఎక్కువగా ఈ కూర్మావతారం ఉంగరాలు ధరిస్తారని చెబుతున్నారు. పవన్ ఈ మధ్య కాలంలోనే యాగాలు చేసారు. సెంటిమెంట్లను పవన్ ఎక్కువగా నమ్ముతున్నారు. దీంతో, తాను నమ్మే జ్యోతిష్కుల సూచనల మేరకే ఈ ఉంగరాలు ధరించారనే చర్చ వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications