దీపావళి ఎప్పుడు ? ఈ నెల 20నా.. 21నా..: అసలు ముహూర్తం..!!

దీపావళి. ప్రతీ ఇంటి సంతోషంగా.. వైభవంగా జరుపుకునే పండుగ. ప్రపంచ దేశాల్లోనూ భారతీయులు ఉన్న ప్రతీ చోట ఈ పండుగ నిర్వహిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవిని, గణేశుడిని పూజిస్తారు, కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు కోసం పూజలు నిర్వహిస్తారు. ప్రతీ ఏటా ఈ పండుగను ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున జరుపుకుంటారు. అయితే, ఈ సారి ఈ పండుగ
జరుపుకునే విషయంలో కొంత గందరగోళం నెలకొంది. దీంతో.. దీపావళి ముహూర్తం.. శుభ సమయం పైన పండితులు స్పష్టత ఇస్తున్నారు.

దృక్ పంచాంగం ప్రకారం.. ఆశ్వయుజ మాసం 2025 అమావాస్య తిథి అక్టోబర్ 20వ తేదీ సాయంత్రం 3.44 గంటలకు ప్రారంభం అవుతన్నట్లు పండితులు చెబుతున్నారు. అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 5.54 గంటలకు ముగుస్తుందని వెల్లడించారు. దీంతో, అక్టోబర్‌ 20వ తేదీన సోమవారం రోజు దీపావళి పండుగ జరుపుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. ఈరోజునే లక్ష్మీ పూజ ఆచరించటం మంచిదని చెబుతున్నారు. ఇక లక్ష్మీ పూజ ఆచరించడానికి సాయంత్రం 7.08 గంటల నుంచి 8.18 గంటల వరకు శుభ ముహూర్తంగా వెల్లడించారు.

when-is-deepavali-is-expected-to-fall-on-either-monday-20-or-tuesday-21

అదే విధంగా.. ప్రదోష కాలం సాయంత్రం 5.46 గంటల నుంచి రాత్రి 8.18 గంటల వరకు.. అదే వృషభ కాలం రాత్రి 7.08 నుంచి 9.03 గంటల వరకు ఉంటుందని వివరిస్తున్నారు. ఇక చాలా మంది దీపావళి రోజున లక్ష్మీదేవిని , గణేశుడిని పూజించే ముందు.. ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసి ప్రవేశ ద్వారం వద్ద ముగ్గు వేయాలి. ప్రధాన ద్వారానికి ఇరువైపులా దీపాలు వెలిగించండి. పూజా స్థలంలో ఎర్రటి వస్త్రంతో వేసి ఆ పీటం మీద లక్ష్మీదేవి, గణేశుడు, కుబేరుడి విగ్రహాలను ప్రతిష్టించి యధావిధిగా పూజ చేస్తారు. ఆ పూజా సమయంలో కొత్త ఖాతా పుస్తకాలు, ఇనప్పెట్టెలు, సంపదను కూడా పూజిస్తారు. పూజ సమయంలో 11, 21, లేదా 51 దీపాలను వెలిగించటం ఆనవాయితీగా వస్తోంది.

ఇక, దీపావళి సాయంత్రం తులసి మొక్క దగ్గర తొమ్మిది నెయ్యి దీపాలను వెలిగించటం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఇది ఇంటి నుంచి ప్రతికూల శక్తిని తొలగిస్తుందని, లక్ష్మీ దేవిని ప్రసన్నం అవుతుందని నమ్ముతారు. దీపావళి నాడు పలు ప్రాంతాల్లో వారి సంప్రదాయాలకు అనుగుణంగా.. పూజలు చేస్తారు. అయితే, ముహూర్త విషయంలో ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి. దీంతో... సాధారణంగా పండితులు చెబుతున్న అంశాల విషయంలోనూ ఎవరి అభిప్రాయాల మేరకు వారు పండుగ నిర్వహిస్తారు. ఇక.. ఇప్పటికే దీపావళి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు మొదలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+