106 ఏళ్ల బామ్మ... ఈ వయసులో కూడా చికెన్ కూర వండితే... ఆహా నా సామి రంగా...

గుడివాడ : మస్తానమ్మ పేరు వింటే చాలు.. చికెన్ ప్రియులకు నోట్లో లాలాజలం ఊరిపోతుంది. 106 ఏళ్ల వయసులో కూడా ఈ బామ్మ చికెన్ కర్రీ వండితే.. దాని రుచి ఉంటుందీ.. ఆహా నా సామిరంగా.. మాంసాహార ప్రియులు లొట్టలేయాల్సిందే.

వంటల ప్రపంచంలో మస్తానమ్మ వంటలు అంత ఫేమస్. ఆంధ్రప్రదేశ్ గుడివాడకు చెందిన మస్తానమ్మ ఘుమఘుమలు ఒక్క మనదేశంలోనే కాదు.. అమెరికా, ఇంగ్లండ్, యూరప్, కరాచీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు కూడా వ్యాపించాయి.

 Why Is This 106-Year-Old Granny An Internet Sensation?

మస్తానమ్మ కాంబినేషన్ ఘుమఘుమలకు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. ఈ వృద్ధురాలి వంటలకు అభిమాని అయిన ఓ పాకిస్తాన్ దేశస్తుడు ఆమె 106వ జన్మదినం సందర్భంగా ఆమెకు ఓ చీర కూడా బహుమతిగా పంపించారంటే.. వంటల ప్రపంచంలో ఈ బామ్మగారికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

మస్తానమ్మ కంట్రీ ఫుడ్స్ వీడియోలు...

ఇక మస్తానమ్మ వంటల వీడియోలకి యూట్యూబ్‌లో 43 మిలియన్ల వ్యూస్ ఉన్నాయి. యూట్యూబ్‌లో 'మస్తానమ్మ, కంట్రీ ఫుడ్స్' అని కొడితే చాలు.. సుమారు 40కి పైగా వీడియోస్ కనిపిస్తాయి.

పుచ్చకాయలో చికెన్ కర్రీ...

కంట్రీ ఫుడ్స్‌కి 2,50,000 మంది సబ్ స్కైబర్స్ కూడా ఉన్నారు. పుచ్చకాయలో చికెన్ కర్రీ వీడియోకు అయితే బీభత్సమైన స్పందన వచ్చింది. ఈ ఒక్క వీడియోనే సుమారు 70 లక్షల మంది చూశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+