వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలనాటి తార జమున రాజకీయాలకు ఎందుకు దూరమయ్యారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

భీమవరం: ఒకప్పుడు అలనాటి తార, రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యురాలు జమున రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇటీవలి కాలంలో ఆమె వాటికి దూరమయ్యారు. అలా ఎందుకయ్యారనడానికి ఆమె కారణాలు చెప్పారు. నేటి రాజకీయాలు సచ్ఛీలత, విలువలకు దూరమయ్యాయని, డబ్బుతో ముడిపడి వున్నాయని, అందువల్లనే వాటిలో ఇమ డలేక తాను దూరంగా ఉన్నానని చెప్పారు.

భీమవరం మావుళ్లమ్మ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరైన జమున ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఒకప్పుడు రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడమనే భావం ఉండేదని, ఇప్పుడు మాత్రం రూ.లక్షలు ఖర్చుపెట్టి రూ.కోట్లు సంపా దించు అనే రీతిలో మారిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Why Jamuna keeping away from politics

1989లో రాజమండ్రి ఎంపీగా తాను గెలుపొందానని, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కేవలం డబ్బు లేకపోవడం వల్లనే ఓడిపోయాననే విషయాన్ని ఇప్పటికీ మర్చిపోలేదనన్నారు. డబ్బు చుట్టూ తిరిగే రాజకీయాల వల్లనే తాను వాటికి దూరంగా ఉంటూ కళాకారుల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని చెప్పా రు.

దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ప్రోదల్బంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. అప్పట్లో కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు, కొణిజేటి రోశయ్య వంటి నాయకులు తనను ఎంతగానో ప్రోత్సహించారని చెప్పారు. అనంతరం మహిళా కాంగ్రెస్‌లో పనిచేసినా నేటీ రాజకీయాల్లో ఇమడలేక బయటకు వచ్చినట్టు జమున స్పష్టం చేశారు.

English summary
Actress and ex MP Jamuna said that due to money power she is keeping away from politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X