కొడాలికి దొరకని పవన్ అపాయింట్ మెంట్..! ఇంతకీ ఎందుకో తెలుసా.. ?
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాజెక్టుల పేరుతో విచిత్ర విన్యాసాలు చేస్తున్నాడని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. 1978 నుంచి 40 ఏళ్లు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ రాయలసీమలో ప్రాజెక్టులు ఎందుకు కట్టలేకపోయారని కొడాలి ప్రశ్నించారు. 40 సంవత్సరాలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్న చంద్రబాబు ఈ ప్రాజెక్టులను ఆనాడు ఎందుకు కట్టలేకపోయారని నాని ప్రశ్నించారు. పులిచింతల ప్రాజెక్టును ఎందుకు నిర్మించలేకపోయాడని, తన సొంత జిల్లాలో గాలేరు, నగరి కాలువలను ఎందుకు తవ్వలేకపోయారని నిలదీశారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు చెబితే చంద్రబాబు రాత్రిపూట కూడా భయపడుతున్నాడని, 70 ఏళ్ల వయసున్న పెద్దిరెడ్డి నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేస్తారని, కుప్పంలో కూడా పెద్దిరెడ్డి ఏదో చేస్తారనే భయంతో చంద్రబాబు ఆయన్ను బ్రతిమిలాడుకుంటున్నారని కొడాలి ఎద్దేవా చేశారు. కుప్పంలో చంద్రబాబును ఓడించి రాష్ట్రం నుంచి తరిమికొట్టేంతవరకు పెద్దిరెడ్డి నిద్రపోరన్నారు. 2024 ఎన్నికలలో చంద్రబాబుకు రాజకీయ చరమగీతం పాడేది పెద్దిరెడ్డే అన్నారు.

పవన్ కళ్యాణ్ మూడో విడత ప్రచారం రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కొడాలి నాని తెలిపారు. తాను పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు అనేకమార్లు ప్రయత్నించినా అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. చంద్రబాబు ఆత్మీయులంతా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేసేవారని, చంద్రబాబు ఆత్మీయులంతా ఏదో లబ్ధి పొందుదామని ఆయన వెనకున్నారని, ప్రస్తుతం ఆయన పదవిలో లేకపోవడంతో వాళ్లంతా చతికిల పడ్డారన్నారు.
చంద్రబాబు కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాలేడని, అందుకే పవన్ కళ్యాణ్ ను కలుపుకుంటే కనీసం అధికారంలోకి రావడం గానీ ప్రతిపక్ష హోదాగాని వస్తుందనే ఆశతో ఉన్నారని విమర్శించారు. ఇది పవన్ కళ్యాణ్ గమనించాలని కొడాలి సూచించారు. అవసరానికి వాడుకుని వదిలేయటం చంద్రబాబు రక్తంలోనే ఉందని, టీడీపీని స్థాపించి నలుదిక్కులా విస్తరింపజేసిన ఎన్టీ రామారావు లాంటి వ్యక్తినే చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని లాక్కొని వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.
రాజకీయంగా పవన్ కళ్యాణ్ తమను ఎదుర్కొంటూ ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే సమాధానం ఇస్తామని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్నికలు అయ్యేవరకు, పవన్ కళ్యాణ్ ఎన్ని విడతల యాత్రలు చేసిన తమకు అభ్యంతరం లేదని, చంద్రబాబు మద్దతు దారులతో కలిసి తమను విమర్శిస్తేనే తాము సహించమని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు కాటాకు వెళ్లిపోవడంతో, ఆయన శ్రేయోభిలాషులందరూ పవన్ కళ్యాణ్ కు మద్దతుదారులుగా మారారనివారి అంతిమ లక్ష్యం చంద్రబాబుని కనీసం ప్రతిపక్ష నేతగనైనా చూడాటమేనని కొడాలి నాని అన్నారు.












Click it and Unblock the Notifications