వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రావెలకు బాబు షాక్: ఆ ప్రశ్నతో బిత్తరపోయిన మాజీమంత్రి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడిగిన ప్రశ్నకు మాజీ మంత్రి రావెలకిషోర్‌బాబు షాక్‌కు గురయ్యారు. అయితే ఏదో సమాధానం చెప్పి ఆయన బాబును సంతృప్తిచేసే ప్రయత్నం చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడిగిన ప్రశ్నకు మాజీ మంత్రి రావెలకిషోర్‌బాబు షాక్‌కు గురయ్యారు. అయితే ఏదో సమాధానం చెప్పి ఆయన బాబును సంతృప్తిచేసే ప్రయత్నం చేశారు.

గుంటూరు జిల్లాలో ఎం‌ఆర్‌పిఎస్ కురుక్షేత్ర సభ విషయమై మాదిగ సామాజికవర్గానికి చెందిన నేతలు, ప్రజాప్రతినిధులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. అయితే ఈ సందర్భంగా మందకృష్ణమాదిగ నిర్వహించిన కురుక్షేత్రసభ విషయమై చర్చకు వచ్చింది.

ravela kishore babbu

రాష్ట్రాన్ని విభజిస్తున్న వేళ తనకు తెలంగాణే ముఖ్యమని మందకృష్ణమాదిగ ప్రకటించారని, ఇప్పుడు ఏపీకి వచ్చి పోరాటాలు చేయడం ఏంటని ఎమ్మెల్యే అనిత ఈ సమావేశంలో ప్రస్తావించారు.

Recommended Video

Chandrababu discussions In co ordination meeting Over strategies for Nandyal bypolls

అయితే ఈ సమయంలోనే మాజీమంత్రి రావెల కిషోర్‌బాబు జోక్యం చేసుకొన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో మందకృష్ణను రాష్ట్రంలోకి రాకుండా చేసినట్టు చెప్పారు. మాదిగల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా ఆయన విమర్శలు చేయడం అర్ధరహితమన్నారు.

వెంటనే చంద్రబాబునాయుడు జోక్యం చేసుకొన్నారు. ఇప్పుడేమో మీరు ఆయన్ను ఇంట్లోనే పెట్టుకొన్నారుగా అన్నారు. గుంటూరులోని మీ ఇంట్లోనే కదా మందకృష్ణమాదిగ బస చేసిందని బాబు మాజీమంత్రి రావెలను ప్రశ్నించారు.

దీంతో ఏం సమాధానం చెప్పాలో ఆయనకు అర్ధంకాలేదు. కొంత సమయం తీసుకొన్న తర్వాత ఆయన తేరుకొన్నారు. చందాల కోసం మందకృష్ణ తన ఇంటికి వచ్చిపోతుంటాడని రావెల చెప్పారు. అయితే మందకృష్ణ బస చేసిన ఇల్లు రావెలకిషోర్‌బాబుదని ఎలా తెలిసిందని నేతలు చర్చించుకొన్నారు.

English summary
Why stays MRPS founder president Manda krishna in your house asked Ap chief minister to former minister Ravela Kishore Babu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X