ఏపీలో ఉద్యోగులకు రూ.70 వేల కోట్లు ? వాలంటీర్లు, సలహాదారులకు రూ.20 వేల కోట్లు ?

ఏపీలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల్ని వైసీపీ సర్కార్ నెరవేర్చలేదని ఆరోపిస్తూ వారు రోడ్డెక్కుతున్నారు. దీంతో వీరిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఉద్యోగులపై పెడుతున్న ఖర్చుకు సంబంధించి లెక్కల్ని లీక్ చేస్తోంది. దీనిపై స్పందించిన ఉద్యోగులు మీ వాలంటీర్లు, సలహాదారులకు ఇస్తున్న లెక్కలు మాత్రం చెప్పరా అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలకు మాత్రం వాస్తవాలు తెలుస్తున్నాయి.

ఏపీలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్న ఏపీ జేఏసీ అమరావతి.. ఈ క్రమంలో ప్రభుత్వం తమపై చేస్తున్న ప్రచారాన్ని తప్పుబడుతోంది. ఉద్యోగాలకు సకాలంలో జీతాలివ్వని ప్రభుత్వం తమపై రూ.70 వేల కోట్లు ఖర్చుపెడుతున్నట్లు ప్రచారం చేయడాన్ని జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు తప్పుబట్టారు. కేవలం ఉద్యోగులకే రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ysrcp-logo

మరోవైపు ఉద్యోగులపై రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై మండిపడిన ఉద్యోగ నేత బొప్పరాజు.. మరి మీ వాలంటీర్లు, సలహాదారులపై రూ.20 వేల కోట్లు ఖర్చు పెడుతున్న విషయం చెప్పరా అంటూ ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున వాలంటీర్లు, సలహాదారులపై ఖర్చు పెడుతోందా అన్న చర్చ మొదలైంది.
దీంతో పాటే మరికొన్ని లెక్కలు కూడా త్వరలోకి బయటికి వచ్చేలా కనిపిస్తున్నాయి.

వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 2.67 లక్షల మంది వాలంటీర్లతో పాటు లెక్కలేనంతగా సలహాదారుల్ని నియమించింది. వీరిలో వాలంటీర్లకు నెలకు రూ.5వేల చొప్పున గౌరవ వేతనంగా అందిస్తున్నారు. అంటే ఏడాదికి ఒక్కో వాలంటీర్ కు రూ.60వేల రూపాయలు ఇస్తున్నారు. అలాగే సలహాదారులకు నెలకు రూ.2 లక్షల రూపాయల నుంచి రూ.3 లక్షల వరకూ ఇస్తున్నారు. ఈ లెక్కన కేవలం ఒక్కో సలహాదారుపైనే ఏడాదికి కనీసం రూ.36 లక్షలు ఖర్చవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+