జగన్ తీరుపై సొంత పార్టీలో అసంతృప్తి, మాట్లాడేందుకు లోకేష్ రెడీ?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు (సోమవారం) లండన్ వెళ్తున్నారు. మరోవైపు టిడిపి.. వైసిపి అసంతృప్త ఎమ్మెల్యేలపై దృష్టి సారించింది.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు (సోమవారం) లండన్ వెళ్తున్నారు.
మరోవైపు టిడిపి.. వైసిపి అసంతృప్త ఎమ్మెల్యేలపై దృష్టి సారించింది. అంతేకాదు, ఆయా చోట్ల బలం ఉన్న, తమ వైపు వచ్చే ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల జాబితాను సిద్ధం చేసే బాధ్యతను కొందరు నేతలకు అప్పగించారని తెలుస్తోంది.

వైసిపిలో అసంతృప్తి
వైయస్ జగన్ లండన్ పర్యటన నుంచి వచ్చేసరికి ఎంతోకొంత మందిని తమవైపుకు లాక్కోవాలని టిడిపి భావిస్తోంది. నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం వైసిపి నేతల్లో పలువురిలో అసంతృప్తి నెలకొందనే వాదనలు వినిపిస్తున్నాయి.

జగన్‌కు వరుస షాక్‌లు
ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందే ఇలా జగన్‌కు షాక్ తగలడం, పైగా ఎంతో ప్రతిష్టాత్మకంగా, కచ్చితంగా గెలుస్తామనుకున్న నంద్యాలలో ఓటమిని చాలామంది వైసిపి నేతలు జీర్ణించుకోవడం లేదని తెలుస్తోంది.

మొక్కుబడి తప్పితే
నంద్యాలలో వైసిపి ఓటమికి అధినేత జగన్ వైఖరి కారణమని కూడా కొందరు నేతలు భావిస్తున్నారు. ఓటమి తర్వాత మొక్కుబడిగా సమీక్ష మినహా, పెద్దగా చేసింది కూడా లేదని కొందరు నేతలు వాపోతున్నారని తెలుస్తోంది.

అసంతృప్త నేతలతో ముఖ్య నేతలు మాట్లాడే అవకాశం
అసంతృప్త వైసిపి నేతల జాబితాతో మంత్రి నారా లోకేష్ సహా పలువురు నేతలు మాట్లాడనున్నారని ప్రచారం సాగుతోంది. నేతలు నిజంగానే అసంతృప్తిగా ఉంటే రానున్న రోజల్లో జగన్‌కు గట్టి షాక్ తప్పదని అంటున్నారు.

గత అనుభవం..
త్వరలో చంద్రబాబు ప్రభుత్వం పడిపోతుందని, త్వరలో మేమే అధికారంలోకి వస్తామని జగన్ పదేపదే చెప్పారు. అంతేకాదు, చంద్రబాబుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసి, తన వైపు పలువురు ఎమ్మెల్యేలు వస్తారని చెప్పారు. కానీ ఆ తర్వాత వైసిపి నుంచే 21 మంది వెళ్లిపోయారు. ఇప్పుడు ఏకంగా ఎన్నికలకు ముందు జగన్‌కు షాక్ తగలడంతో పలువురు టిడిపిలో చేరడం ఖాయమంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి 175 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
-
326A జాతీయ రహదారిపై కేంద్రమంత్రి తీపికబురు! -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications